32.5 C
Hyderabad
Tuesday, June 16, 2026

Live Video

spot_img

మహా కుంభ మేళా జరిగే తేదీలు.. ప్రాంతాలు..

దేశంలో 12 ఏళ్లకు ఒకసారి జరిగే మహా కుంభ మేళా భారత దేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది.. ఈ మేళాలో కోట్లాది మంది భక్తులు పాల్గొంటారు. మహా కుంభ మేళాలో పుణ్య స్నానాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. 2025 జనవరిలో నిర్వహించే బోయే మహా కుంభ మేళాకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహా కుంభ మేళా ఏ, ఏ ప్రాంతాల్లో ఏ, ఏ తేదీల్లో జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఉత్తర ప్రదేశ్‌ లోని ప్రయాగ్‌రాజ్‌లో 2025 జనవరి 13న పౌష్య పూర్ణిమ నుంచి కుంభ మేళా ప్రారంభం కానుంది. ఇది 2025, ఫిబ్రవరి 26న శివరాత్రితో ముగియనుంది. అంతకు ముందు 2013లో ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభ మేళా నిర్వహించారు.

పుణ్య స్నానాలు – తేదీలు:

మొదటి పుణ్య స్నానం జనవరి 13న పౌష్య పూర్ణిమ రోజున జరగనుంది.

జనవరి 14న మకర సంక్రాంతి శుభ సందర్భంగా భక్తులు పుణ్య స్నానాలు చేయనున్నారు.

జనవరి 29న మౌని అమావాస్య నాడు పుణ్య స్నానాలు ఆచరించ నున్నారు.

ఫిబ్రవరి 3న వసంత పంచమి శుభ సందర్భంగా పుణ్య స్నానాలు చేయనున్నారు.

ఫిబ్రవరి 12న మాఘ పూర్ణిమ రోజున పుణ్య స్నానాలు చేయున్నారు.

ఫిబ్రవరి 26న మహా శివరాత్రి రోజున కుంభ మేళాలో చివరి పుణ్య స్నానాలు చేయనున్నారు.

మహా కుంభ మేళాలో పుణ్య స్నానాలను అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. ఈ ప్రత్యేకమైన రోజున సాధువులు, నాగా సాధువులు, ఇతర శాఖల మహంత్‌లు పుణ్య స్నానాలు ఆచరిస్తారు. వారు స్నానం చేసిన తరువాత సామాన్య భక్తులకు పుణ్య స్నానాలు చేసే అవకాశం లభిస్తుంది. మన దేశంతో పాటు విదేశాల నుండి కోట్లాది మంది హిందువులు పుణ్య స్నానాలు ఆచరించేందుకు ఇక్కడకు తరలి వస్తుంటారు. మహా కుంభ మేళా జరిగే సమయంలో త్రివేణి సంగమం లోని నీరు అమృతంలా మారుతుందని చెబుతుంటారు. మహా కుంభ మేళా సమయంలో పుణ్య స్నానాలు చేయడం వల్ల పాపాలు నశించి, మోక్షం లభిస్తుందని హిందువులు నమ్ముతారు.

పుణ్య స్నానాలు – ప్రాంతాలు:

ప్రయాగ్‌రాజ్‌..

యూపీ లోని ప్రయాగ్‌రాజ్ మహా కుంభ మేళాకు కేంద్రంగా నిలుస్తుంది. ఇక్కడి త్రివేణి సంగమంలో భక్తులు పూజలు, పుణ్య స్నానాలు చేస్తారు. గంగా, యమున, సరస్వతి నదుల సంగమం ఇది. ఇక్కడ సరస్వతి నది అదృశ్యంగా ఉంటుందని అంటారు.

హరిద్వార్..

కుంభ మేళా సమయంలో లక్షలాది మంది భక్తులు ఉత్తరాఖండ్‌ లోని హరిద్వార్‌లో పుణ్య స్నానాలు చేస్తారు. గంగా నది.. పర్వతాలను వీడి ఇక్కడి నుంచే మైదానాలలోకి ప్రవేశిస్తుంది. హరిద్వార్.. హిమాలయ పర్వత శ్రేణి లోని శివాలిక్ పర్వతాల దిగువన ఉంది. హరిద్వార్‌ను తపోవన్, మాయాపురి, గంగా ద్వార్, మోక్ష ద్వార్ అని కూడా పిలుస్తుంటారు.

నాసిక్..

నాసిక్‌లో జరిగే కుంభ మేళాను నాసిక్ త్రయంబక్ కుంభ మేళా అని కూడా అంటారు. దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో త్రయంబకేశ్వరం ఒకటి.. త్రయంబకేశ్వరంలో 12 ఏళ్లకు ఒకసారి సింహస్థ కుంభ మేళా జరుగుతుంది. కుంభ మేళా సందర్భంగా, వేలాది మంది భక్తులు గోదావరి పవిత్ర జలాల్లో స్నానాలు చేస్తారు. ఇక్కడ శివరాత్రిని ఎంతో వైభవంగా నిర్వహిస్తారు.

ఉజ్జయిని..

ఉజ్జయినిలో క్షిప్రా నది ఒడ్డున పుణ్య స్నానాలు చేస్తారు. ఈ సందర్భంగా భక్తులు మహా కాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయాన్ని సందర్శిస్తారు. ఉజ్జయిని నగరం మధ్య ప్రదేశ్‌కు పశ్చిమాన ఉంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com