25 C
Hyderabad
Tuesday, July 28, 2026

Live Video

spot_img

ముంబై గెలిచింది.. రోహిత్ మాస్టర్‌మైండే కారణమా?

ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఆఖరి వరకు ఉత్కంఠగా సాగింది మ్యాచ్. కానీ గెలుపు మాత్రం ముంబైదే. కానీ ఈ గెలుపుకు ప్రధాన కారణం రోహిత్ శర్మ అనే టాక్ వినిపిస్తోంది. ఈ మ్యాచ్‌ను మలుపు తిప్పింది ముంబై కొత్త బాల్ తీసుకోవడం వల్ల. 14వ ఓవర్‌కు ముందు ముంబై బాల్ ఛేంజ్ చేయించగా.. లెగ్ స్పిన్నర్ కరణ్ శర్మతో బౌలింగ్ వేయించాలని రోహిత్ సూచించాడు. అదే ప్లాన్‌ను హార్ధిక్ ఫాలో అయ్యాడు. అదే ఓవర్‌లో కీలకమైన స్టబ్స్‌ వికెట్ పడింది. ఈ వికెట్‌తో మ్యాచ్‌ మీద కంట్రోల్ కోల్పోయింది ఢిల్లీ. గెలుపు ముంబైని వరించింది.

వాంఖడే వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌ 12 పరుగుల తేడాతో గెలిచింది ముంబై. ఢిల్లీ ఓటమికి ప్రధాన కారణం రనౌట్లు. ఏకంగా మూడు కీలక వికెట్లను కోల్పోయింది ఢిల్లీ. ఈ సీజన్‌లో ఢిల్లీకి ఇదే తొలి ఓటమి. ముంబైకి మాత్రం రెండో విజయం. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై.. తిలక్ వర్మ 59, నమన్ ధీర్ 38, రికిల్‌టన్ 41, సూర్యకుమార్ 40 పరుగులు చేయడంతో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.

206 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఢిల్లీ.. మొదటి బంతికే తొలి వికెట్ కోల్పోయింది. కానీ కరుణ్‌ నాయర్ విజృంభించాడు. 40 బంతుల్లో 12 ఫోర్లు, ఐదు సిక్స్‌లు బాది ఏకంగా 89 పరుగులు చేశాడు. మరోవైపు అభిషేక్ పోరెట్ కూడా 33 పరుగులు చేసి మంచి సపోర్ట్ ఇచ్చాడు. ముఖ్యంగా బుమ్రా వేసిన ఆరో ఓవర్‌లో కరుణ్‌ రెండు సిక్స్‌లు.. ఒక ఫోర్ బాదాడు. ఇలా దూసుకుపోతున్న ఢిల్లీ.. వరుస ఓవర్లలో పోరెల్, కరుణ్‌, అక్షర్, స్టబ్స్ వికెట్లు కోల్పోయింది. రాహుల్ కూడా 15 పరుగులతో వెనుదిరగడంతో ఢిల్లీపై ప్రెషర్ పెరిగింది. ఆఖర్లో విప్రాజ్ ఆశలు పెంచినా.. 18వ ఓవర్‌లో స్టంప్‌ ఔట్ కావడంతో మ్యాచ్ టర్న్ అయ్యింది. ఇక అశుతోష్, కుల్‌దీప్, మోహిత్‌ వరుసగా రనౌట్ కావడంతో ఢిల్లీ ఆలౌటైంది. తొలి ఓటమిని తన ఖాతాలో వేసుకుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com