25 C
Hyderabad
Tuesday, July 28, 2026

Live Video

spot_img

బెంగళూరు జోరు.. కోహ్లీ సరికొత్త రికార్డులు..

రాజస్తాన్‌ రాయల్స్‌పై రాయల్‌ ఛాలెంజర్స్‌ జోరు చూపించింది. జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో RR విధించిన 174 పరుగుల టార్గెట్‌ను 17.3 ఓవర్లలోనే చేజ్ చేసేసింది. అది కూడా 9 వికెట్ల తేడాతో. దీంతో ఈ సీజన్‌లో నాలుగో విక్టరీని తన ఖాతాలో వేసుకుంది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది RCB.

మొదట బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ను బెంగళూరు బౌలర్లు కట్టడి చేశారనే చెప్పాలి. జైశ్వాల్ మరోసారి 75 పరుగులతో చెలరేగాడు. ఇతర టీమ్ మెట్స్‌ కూడా బాగా ఆడినప్పటికీ భారీ స్కోర్‌ చేయలేకపోయారు. సంజూ శాంసన్ 15 పరుగులు మాత్రమే చేశాడు. రియాన్ పరాగ్ 30.. ధ్రువ్ జురెల్ 35 పరుగులు చేశారు. దీంతో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది రాజస్థాన్.

174 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన బెంగళూరు.. ఈజీగానే టార్గెట్‌ చేసిందనే చెప్పాలి. సాల్ట్ 65, కోహ్లీ 62 పరుగులతో చెలరేగిపోయారు. ఇక చివర్లో పడిక్కల్ క్రీజులోకి వచ్చి 40 పరుగులు బాదడంతో గెలుపు RCB వశమైంది.

ఈ మ్యాచ్‌లో సరికొత్త రికార్డ్‌ను క్రియేట్ చేశాడు విరాట్ కోహ్లీ. పొట్టి ఫార్మాట్‌లో 100 హాఫ్ సెంచరీలు చేసిన ఘనత తన అకౌంట్‌లో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 37 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు కోహ్లీ. ఇక ఈ సీజన్‌లో మూడోది. ఓవరాల్‌గా చూస్తే 100 హాఫ్ సెంచరీలు చేసిన రెండో ప్లేయర్‌గా నిలిచాడు కోహ్లీ. తొలి ప్లేయర్‌గా డేవిడ్ వార్నర్‌ ఉన్నాడు.  అతని లిస్ట్‌లో 108 హాఫ్ సెంచరీలున్నాయి. వీరిద్దరి తర్వాత 90 హాఫ్ సెంచరీలతో బాబర్ అజామ్, 88తో గేల్, 86 హాఫ్ సెంచరీలతో జోస్ బట్లర్ ఉన్నారు. ప్రస్తుతం వార్నర్‌ పొట్టి ఫార్మాట్‌కు దూరంగా ఉన్నాడు. దీంతో మరో 9 హాఫ్ సెంచరీలు చేస్తే.. ఈ రికార్డ్ కూడా కోహ్లీ ఖాతాలోనే పడుతుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com