28.7 C
Hyderabad
Thursday, August 6, 2026

Live Video

spot_img

ముక్కోటి ఏకాదశి… భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల

తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తిరుమలలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రత్యేకంగా తీరొక్క పూలతో ఆలయాన్ని అలంకరించారు. దేవదువుడు వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం వస్తున్న భక్తులతో తిరుమల జనసంద్రంగా మారింది. ఈ నేపథ్యంలో తిరుమలలో శుక్రవారం వేకువజామున శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. ఈ ఏడాది ఈ నెల 19వ తేదీ వరకు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనానికి టీటీడీ అధికారులు సౌకర్యాలు కల్పించారు.

భక్తుల రద్దీ నేపథ్యంలో పది రోజుల పాటు ఆలయంలో జరిగే అన్ని ఆర్జిత సేవలతో పాటు ప్రత్యేక దర్శనాలను టిటిడి రద్దు చేసింది. ఈ 10 రోజుల పాటు కేవలం దర్శనం టికెట్, టోకెన్స్ కలిగిన భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతించనున్నారు. ఈ రోజు శుక్రవారం కావడంతో అర్చకులు శ్రీవారికీ ఏకాంతంగా అభిషేకాన్ని నిర్వహించారు.

పూజది కైంకర్యాలు ముగిసిన అనంతరం ఉదయం 4.30 గంటల నుంచి ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులకు శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనానికి అనుమతించారు. ఉదయం 8 గంటలకు సర్వదర్శనం ద్వారా సామాన్య భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పించారు. ఉదయం 9 గంటలకు శ్రీదేవి,భూదేవి సమేత మలయప్పస్వామి స్వర్ణ రధంపై ఆలయ తిరు విధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు. 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వాహన మండపంలో ఉత్సవ మూర్తుల దర్శనం భక్తులకు కల్పించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com