27.2 C
Hyderabad
Sunday, April 19, 2026

Live Video

spot_img

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మక్కీ గుండెపోటుతో మృతి

భారత్ మోస్ట్ వాంటెడ్ ట్రెర్రరిస్ట్ అబ్దుల్ రెహ్మాన్ మక్కీ పాకిస్తాన్ లోని లాహోర్ పట్టణంలో శుక్రవారం గుండెపోటుతో మృతి చెందినట్లు పీటీఐ వార్తా సంస్ధ నిర్ధారించింది. నిషేధిత ఉగ్రవాద సంస్ధ లష్కర్ యి తోయిబా డిప్యూటీ కమాండ్ అయిన మక్కీ 26/11 ముంబయ్ ఉగ్రదాడులకు కీలక కుట్రదారుడు. లష్కరే యి తోయిబా వ్యవస్ధాపకుడు హఫీజ్ సయీద్ కు అత్యంత సన్నిహితుడు, బావమరిది కూడా అయిన మక్కీ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఉగ్రవాద సంస్ధగా గుర్తించిన జామాత్ ఉద్ దవాకు నాయకుడిగా పదేళ్ళు వ్యవహరించాడు. భారత్ నిఘా సంస్ధలు మక్కీ కోసం 2008 నుంచి గాలిస్తున్నాయి. అయితే శుక్రవారం మక్కీ లాహోర్ లో గుండెపోటుతో మృతి చెందాడు. గడచిన దశాబ్దకాలంగా అబ్దుల్ రహ్మాన్ మక్కీ గృహ నిర్బంధంలోనే లాహోర్ లో నివాసం ఉంటున్నారు. భారతదేశం నుంచే కాకుండా అగ్రరాజ్యం అమెరికా కూడా మక్కీతో పాటు లష్కరే తోయిబా సంస్ధను ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్ధగా గుర్తించింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com