25.2 C
Hyderabad
Monday, July 27, 2026

Live Video

spot_img

మాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం – ఇద్దరు యువకులు దుర్మరణం

హైదరాబాద్‌ మాదాపూర్‌ పరిధిలో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. అయ్యప్ప సొసైటీ 100 ఫీట్స్‌ రోడ్డుపై వేగంగా వచ్చిన బుల్లెట్‌బైక్‌ మధ్యలో డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో, బైక్‌పై ఉన్న ఇద్దరూ ఎగిరి రోడ్డుమీద పడిపోయారు. బుల్లెట్‌బైక్‌ కిందపడ్డాక కూడా అదే వేగంతో దాదాపు వంద మీటర్ల దూరం దూసుకెళ్లింది. బైక్‌ నడుపుతున్నవ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు చెబుతున్నారు. మృతులను బోరబండకు చెందిన రఘుబాబు, ఆకాంక్ష్‌గా గుర్తించారు. మాదాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com