ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల పర్యటన ముగిసింది. నాలుగురోజుల పర్యటన కోసం వైఎస్ జగన్ పులివెందులకు వెళ్లారు. నాలుగు రోజుల పాటు పులివెందుల నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈనెల 24వ తేదీన బెంగళూరు నుంచి ఇడుపులపాయకు చేరుకున్న జగన్.. ముందుగా తన తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించారు. అనంతరం కడప కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత అదేరోజు ముందస్తు క్రిస్మస్ వేడుకలలో పాల్గన్నారు. 25వ తేదీ ఉదయం పులివెందుల సిఎస్‌ఐ చర్చ్‌లో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం లింగాల మండలం తాతి రెడ్డిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన కోదండ రామాలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. 26వ తేదీన పులివెందుల క్యాంప్ ఆఫీసులో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఇవాళ ఉదయం ఓ వివాహ వేడుకలో పాల్గొన్నారు. తర్వాత ఉదయం 11 గంటలకు రోడ్డు మార్గంలో ముదుగుబ్బ , బత్తలపల్లె మీదుగా బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు వైఎస్ జగన్.