- ఎవరిదా సొమ్ము?
- పార్లమెంటును కుదిపేస్తున్న ఉదంతం
రాజ్య సభలో ఓ పార్లమెంటు సభ్యుని సీటు దగ్గర 5వందల నోట్ల కట్ట కనపడటం కలకలం రేపుతోంది. రాజ్యసభలోకి ఈ నోట్ల కట్ట ఎలా వచ్చిందన్నది అంతు చిక్కకుండా ఉంది. నిన్న రాజ్యసభ వాయిదాపడిన తర్వాత రొటీన్ చెకింగ్ లో భాగంగా సభను తనిఖీ చేసినప్పుుడు కాంగ్రెస్ సభ్యుని సీటు దగ్గర ఈ నోట్ల కట్ట కనిపించింది. సాధారణంగా భద్రతా సిబ్బంది సభ్యులను పూర్తిగా పరిశీలించాకే లోపలకి పంపిస్తారు. మరి ఈ నోట్ల కట్ట బెంచీ దిగువకి ఎలా వచ్చిందన్నది అధికార్లకు అర్ధం కాలేదు. కాంగ్రెస్ సభ్యుడు అభిషేక్ మనుసింఘ్వి కూర్చున్న సీటు నెంబర్ 222 దగ్గర ఈ కట్ట కనిపించింది. సింఘ్వీ ప్రస్తుతం తెలంగాణ స్టేట్ నుంచి రాజ్య సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీనిపై ఛైర్మన్ జగ్ దీప్ ధన్ కర్ విచారణకు ఆదేశించారు. అయితే సింఘ్వీ సీటు దగ్గర నోట్ల కట్ట కనిపించడంతో సభలో కాంగ్రెస్ సభ్యులు, బీజేపి నేతల మధ్య వాద ప్రతివాదాలు జరిగాయి. సింఘ్వీని అనుమానించడం పై కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖడ్గే అభ్యంతరం వ్యక్తంచేశారు. దీనిపై ఛైర్మన్ విచారణకు ఆదేశించడంతో పరిస్థితి సద్దుమణిగింది.