మోహన్ బాబు మానసిక పరిస్ధితి బాగాలేదని డాక్టర్లు ప్రకటించారు. బుధవారం మధ్యాహ్నం మోహన్ బాబు ఆరోగ్య పరిస్ధితిపై ఆయన చికిత్స పొందుతున్న గచ్చిబౌలిలోని ఓ కార్పొరేట్ హాస్పట్ వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. మోహన్ బాబు మానసికంగా బాధలో ఉన్నారని ఏం జరుగుతోందో అర్ధం చసుకోలని స్ధితిలో ఉన్నారని వైద్యులు పేర్కొన్నారు. ఆయన ఆరోగ్యం స్ధిమితంగా లేదని ఎడమ కంటి కింద కమిలిన గాయం ఉందని అలాగే కుడి కంటి కింద వాపు గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. అలాగే ఆయన హైబీపీతో బాధపడుతున్నారని, హార్ట్ రేట్ కూడా ఎక్కవగా ఉందని వైద్యులు చెప్పారు. ఈ రోజు సీటీ స్కాన్ చేస్తామని మోహన్ బాబుకు ఆసుత్రిలో రెండు రోజులు చికిత్స అవసరమని వైద్యులు బుధవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో ప్రకటించారు.