మానాన్న మంచు మోహనబాబు దేవుడిలాంటి వ్యక్తని ఆయనంటే నాకు ప్రాణ సమానమని మంచు మనోజ్ అన్నారు. అయితే మా అన్న విష్ణు అతని స్నేహితుడు వినయ్ లు కలసి మానాన్నను ట్రాప్ చేశారని మనోజ్ తీవ్ర ఆరోపణలు చేశారు. నాపై దాడులు చేశారని, మా నాన్న ముందే నన్ను కొట్టారని మనోజ్ తన బాధను వ్యక్తం చేశారు. మానాన్న దృష్టిలో నన్ను శత్రువు గా చిత్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. నాకు మద్దతుగా ఉన్న మా అమ్మను కూడా డైవర్ట్ చేసి నాకు సర్ధిచెపుతామని ఆమెను నమ్మించారన్నారు. నేనూ నా భార్య కలసి ఒక టాయ్స్ కంపెనీ పెట్టామని దానికి కూడా అడ్డంకులు సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను ఎవరి ఆస్తి అడగలేదని… నాసొంత కాళ్ళ మీద నేను నిలబడుతున్నానని మంచు మనోజ్ తెలిపారు. ఈ వివాదంలోకి అకారణంగా నాభార్య, కూతిరి పేర్లు లాగుతున్నారన్నారు. నిన్న మీడియాపై దాడి చేయడం బాధాకరమని మీడియా మిత్రులకు క్షమాపణలు చెప్పారు మంచు మనోజ్ సాయంత్రం 5 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి అన్ని వివరాలు వెల్లడిస్తానని మనోజ్ ప్రకటించారు.