29.4 C
Hyderabad
Tuesday, September 15, 2026

Live Video

spot_img

మోదీ వరుస భేటీలు.. ఆంతర్యమేంటి?

ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరో కీలక సమావేశం నిర్వహించారు. మోదీతో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ హాజరయ్యారు. భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల సమయంలో ఈ భేటీ చాలా ప్రాధాన్యతను సంతరించుకుందనే చెప్పాలి. ఈ భేటీలో పాక్‌పై సైనిక చర్యతో ఎదురయ్యే సవాళ్లు, పరిస్థితులపై చర్చించినట్టు తెలుస్తోంది. కశ్మీర్ ఉగ్రదాడి తర్వాత సరిహద్దుల్లోని ఉద్రిక్తతలపై రాజేష్ కుమార్ సింగ్ ప్రధాని మోదీకి నివేదిక ఇచ్చారు.

కేవలం రక్షణశాఖ కార్యదర్శి మాత్రమే కాదు.. శనివారం ఇండియన్ నేవీ చీఫ్‌ అడ్మిరల్ దినేష్‌ త్రిపాఠీతో భేటీ అయ్యారు. ఇక ఆదివారం ఎయిర్ చీఫ్‌ మార్షల్ అమర్‌ప్రీత్ సింగ్‌తో భేటీ అయ్యారు. భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల మధ్య ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనేది చర్చించినట్టు తెలుస్తోంది. ఈ భేటీ విషయాలను గోప్యంగా ఉంచుతోంది ప్రధానమంత్రి కార్యాలయం.

ఇప్పటికే ఇండియన్ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ప్రధాని మోదీ. టార్గెట్స్‌ను సెలెక్ట్ చేసుకోవడం.. దాడి ఎప్పుడు చేయాలి? ఎలా చేయాలి? అనే దానిపై త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. దీనికి తగ్గట్టుగానే త్రివిధ దళాలు ఇప్పుడు సైలెంట్‌గా తమ పని తాము చేసుకుంటూ పోతున్నాయి.

అరేబియన్ సముద్రంలో ఇండియన్ నేవీ వరుస క్షిపణి పరీక్షలు.. వ్యూహాత్మక ప్రాంతాల్లో మోహరింపులు.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ వరుస విన్యాసాలు.. ఇవన్నీ కూడా భారత్ ఏదో పెద్దగా చేయబోతుందనే దానికి సంకేతాలన్న ప్రచారం జరుగుతోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com