24 C
Hyderabad
Monday, July 27, 2026

Live Video

spot_img

భారత్ కు పుతిన్ భరోసా

అండగా ఉంటామన్న పుతిన్.. భారత్‌కు రష్యా హామీ

భారత్‌కు చిరకాల మిత్రదేశం రష్యా అని మరోసారి ప్రూవ్ అయ్యింది. భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న ఈ సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కాల్ చేశారు. కశ్మీర్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదంపై భారత్ చేసే పోరాటంలో తమ వంతు సహకారం ఉంటుందని తెలిపారు. అంతేకాదు భారత్‌లో పర్యటించాలన్న మోదీ ఆహ్వానాన్ని కూడా ఆయన అంగీకరించారు.

నిజానికి మే 9న రష్యా విక్టరీ డే వేడుకలను జరుపుకుంటోంది. ఈ వేడుకల్లో పాల్గొనాలంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఇప్పటికే ఆహ్వానం అందింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన పర్యటించే అవకాశం లేకపోవడంతో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కానీ ఆయన కూడా వెళ్లడం ఇప్పుడు అనుమానంగానే ఉంది. ఇలాంటి సమయంలో పుతిన్ ఫోన్ చేసి మాట్లాడటం ఇప్పుడు భారత్‌ వెంట మేమున్నామని చెప్పడమే.

భారత్-రష్యా మధ్య వార్షిక సదస్సు జరుగుతోంది. గతేడాది మోదీ రష్యాలో పర్యటించగా.. ఈ ఏడాది పుతిన్ మన దేశానికి రానున్నారు. నిజానికి పహెల్‌గామ్ ఉగ్రదాడి తర్వాత పుతిన్ ప్రధానిమంత్రి మోదీకి, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు పుతిన్ లేఖ రాశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే.. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోండి మేము మీ వెంట ఉన్నామనే సంకేతాన్ని రష్యా ఇచ్చినట్టైంది. మరోవైపు టర్కీ యుద్ధనౌక పాక్‌కు చేరుకున్న సమయంలో పుతిన్‌ ప్రధాని మోదీకి కాల్ చేయడం కూడా ఓ హైలేట్ అని చెప్పాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com