34.2 C
Hyderabad
Sunday, April 19, 2026

Live Video

spot_img

ఎస్ఎస్ఐఏ ప్రతినిధులతో భేటీ అయిన మంత్రి శ్రీధర్‌ బాబు

తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే సెమీకండక్టర్స్‌ మేనిఫేక్చరింగ్‌ హబ్‌గా తీర్చిదిద్దాలన్న లక్‌యంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కలసి సింగపూర్‌ పర్యటనలో ఉన్న మంత్రి శ్రీధర్‌బాబు శనివారం సింగపూర్‌ సెమీ కండక్టర్స్‌ ఇండస్ట్రీ అసోసియేషన్‌ సభ్యులతో రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో సెమీకండక్టర్ల ఉత్పత్తి రంగంలో సింగపూర్‌ ఏవింధంగా ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిందనే విషయాన్ని మంత్రి శ్రీధర్‌బాబు అసోసియేషన్‌ సభ్యులతో మాట్లాడి తెలుసుకున్నారు. సెమీకండక్టర్ల ఉత్పత్తి సంబంధించి అనేక అంశాలను అసోసియేషన్‌ ప్రతినిధులతో మంత్రి శ్రీధర్‌బాబు బృందం చర్చించింది. అలాగే తెలంగాణ రైజింగ్‌ అంటే ఏమిటి… తెలంగాణ రైజింగ్‌ ఉద్దేశాలు, లక్ష్యాలను మంత్రి శ్రీధర్‌బాబు ఎస్‌ఎస్‌ఐఏ ప్రతినిధులకు వివరించారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలను వారికి విశదపరచి రాష్ట్రంలో భారీగా పెట్టుబలు పెట్టాలని ఎస్ఎస్ఐఏ ప్రతినిధులను మంత్రి శ్రీధర్‌బాబు ఆహ్వానించారు. మంత్రి శ్రీధర్‌బాబు ఆహ్వానానికి ఎస్ఎస్ఐఏ చాలా సానుకూలంగా స్పందించింది. తెలంగాణలో అవకాశలను పరిశీలించడానికి ఈ ఏడాది చివరిలో ఒక బృందం హైదరాబాద్‌ పర్యటిస్తామని ఎస్ఎస్ఐఏ అసోసియేషన్‌ ప్రతినిధులు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబుకు హామీ ఇచ్చారు. ఈ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మంత్రి శ్రీధర్‌ బాబుతోపాటు ఎస్ఎస్ఐఏ చైర్మన్‌ బ్రియాన్‌ టాన్‌, వైస్‌ చైర్మన్‌ టాన్‌ యూ కాంగ్‌, ఎస్ఎస్ఐఏ కార్యదర్శి సీఎస్‌.చువా తదితరలు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com