28.7 C
Hyderabad
Sunday, April 19, 2026

Live Video

spot_img

మాజీ సీఎం ఎన్టీఆర్ కు ఘనంగా నివాళి

తెలుగుదేశం వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 29వ వర్థంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఘనంగా నివాళులర్పించారు.

హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లి కుటుంబ సభ్యులు నివాళి అర్పించారు ఎన్టీఆర్ ఘాట్‌లో నందమూరి, నారా కుటుంబ సభ్యులు నివాళులు ఆర్పించారు. ఉదయం 8 గంటలకు ఎన్టీఆర్ ఘాట్‌లో నందమూరి బాలకృష్ణ నివాళులర్పించగా ఉదయం 8.30గంటలకు ఎన్టీఆర్ ఘాట్‌లో మంత్రి  నారా లోకేష్ నివాళులర్పించారు. ఉదయం 9గంటలకు రసూల్‌పురలో ఎన్టీఆర్ విగ్రహం నుంచి ఎన్టీఆర్ అమరజ్యోతి ర్యాలీని బాలకృష్ణ ప్రారంభించారు. ఉదయం 10గంటలకు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో తల్లిదండ్రుల విగ్రహాలకు బాలకృష్ణ నివాళులర్పించారు.

ఎన్టీఆర్ ఘాట్‌కు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఉదయమే చేరుకుని ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. ఘాట్ వద్ద కాసేపు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్‌ని చూసేందుకు ఘాట్ వద్దకు అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఎన్టీఆర్ ఘాట్‌లో సమాధి చుట్టు తిరిగి., పూలతో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నివాళులు అర్పించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com