సూపర్ హిట్ కాంబినేషన్ గా పేరున్న విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడిల కలయికలో ఇప్పటికే ఎఫ్ 2, ఎఫ్ 3 వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఇదే కోవలో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో అభిమానుల ముందుకు వచ్చారు.
సంక్రాంతి కానుకగా జనవరి 14న సంక్రాంతకి వస్తున్నాం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కుటుంబ కథా చిత్రంగా వచ్చిన ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
సంక్రాంతికి వస్తున్నాం సినిమా సూపర్ హిట్ అవ్వడంతో చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేస్తోంది. తాజాగా ఈ మూవీ టీమ్ సక్సెస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా పాల్గొన్నారు. హీరో వెంకటేష్ ఇంట్లో సంక్రాంతికి వస్తున్నాం సెలబ్రేషన్స్ మహేష్ బాబు హాజరయ్యారు. మహేష్ బాబుతో సంక్రాంతికి వస్తున్నాం టీమ్ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇప్పటికే సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూసిన మహేష్ బాబు చిత్రయూనిట్ కు కంగ్రాట్స్ చెప్తూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. చిత్ర యూనిట్ మహేష్ బాబుతో కలిసి దిగిన ఫోటోలను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. సక్సెస్ సెలబ్రేషన్స్ లో దర్శకుడు అనిల్ రావిపూడి, వెంకటేష్, హీరోయిన్స్ ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరితో పాటు పలువురు పాల్గొన్నారు.