దావోస్ లో అత్యధిక పెట్టుబడులు సాధించినందుకు అభినందన
దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశాల్లో పాల్గొని రికార్డు స్ధాయిలో తెలంగాణ రాష్ట్రానికి లక్షా 78 వేల కోట్ల పైచిలుకు పెట్టుబడులు సాధించడంలో కీలక పాత్ర పోషించిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుని రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభినందించారు. దావోస్ నుంచి సోమవారం హైదరాబాద్‌కి తిరగి వచ్చిన దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంగళవారం సచివాలయానికి వచ్చారు. మంత్రి పొంగులేటి శ్రీధర్‌బాబు ఛాంబర్‌కి వెళ్లి అత్యధిక పెట్టుబడులు సాధించి దావోస్ టూర్ విజయవంతంగా ముగించుకుని వచ్చినందుకు అభిందించారు. శ్రీధర్‌బాబును శాలువాతో కప్పి అభినందించారు పొంగులేటి. ఈ నెల 24తోనే దావోస్ సమ్మిట్ ముగిసినప్పటికీ మరో రెండు రోజులు జ్యూరిచ్‌లోనే ఉండి అనేక మంది పారిశ్రామిక వేత్తలతో భేటీ అయి తెలంగాణలో పెట్టుబడులు పెట్టమని వారిని ఆహ్వానించారు శ్రీధర్‌బాబు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకులంగా ఉన్న పరిస్ధితులు అక్కడి పారిశ్రామికవేత్తలకు వివరించి మరిన్ని పెట్టుబడులు ఆహ్వానించారు మంత్రి శ్రీధర్‌బాబు