అండర్ 19 మహిళా క్రికెట్ విభాగంలో మన భద్రాచలం ఆడపడుచు గొంగడి త్రిష ప్రపంచ రికార్డు నెలకొల్పింది. కౌలాలంపూర్‌లో జరుగుతున్న అండర్ 19 మహిళా క్రికెట్ విభాగం ప్రపంచకప్ పోటీల్లో గొంగడి త్రిష కేవలం 59 బంతుల్లో 110 పరుగులు సాధించి అజేయంగా నిలిచి సంచలనం సృష్టించింది. స్కాట్‌లాండ్ దేశంతో జరగుతున్న మ్యాచ్‌లో త్రిష ఈఫీట్ సాధించి అండర్-19 టీ20ల్లో సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో త్రిష 13 ఫోర్లు, నాలగు సిక్సర్లతో కేవలం 59 బంతుల్లో 110 పరుగులు సాధించింది. త్రిష సెంచరీ సాదించడం వల్ల భారత్ కేవలం ఒక వికెట్ నష్టంతో 208 పరుగులు భారీ స్కోర్ నెలకొల్పింది. 12 ఏళ్ల వయసులోనే హైదరాబాద్ మహిళా క్రికెట్ జట్టుకు ఎంపికయ్యింది త్రిష. లెగ్ స్పిన్నర్ అయిన త్రిష బ్యాటింగ్‌లోనూ రాణించి పవర్ హిట్టింగ్‌లో ఈరోజు టీ20 వరల్డ్ కప్‌లో సెంచరీ సాధించింది. అతి చిన్న వయసులోనే గొంగడి త్రిష బీసీసీఐ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ పొందింది.