24.4 C
Hyderabad
Monday, March 16, 2026

Live Video

spot_img

ప్రత్యర్థులకు మెసేజ్… పుష్పరాజ్ టీ షర్ట్స్

పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అని సినిమాలోనే కాదు నిజజీవితంలో కూడా నిరూపించాడు అల్లు అర్జున్. శుక్రవారం అరెస్టు దగ్గరి నుంచి కోర్టుల్లో విచారణ… రాత్రి జైలులో ఉండటం వరకు ఎప్పుడు ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొంది. ఉదయం పోలీసులు అరెస్టు చేసేందుకు వచ్చినపుడు దుస్తులు మార్చుకునేందుకు కూడా సమయం ఇవ్వలేదని పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరు అనుమానాలకు తావిస్తోంది.

ప్రముఖ నటుడితో పోలీసులు హుందాగా వ్యవహరించలేదని… ప్రభుత్వంలోని పెద్దల ప్రొద్బలంతోనే దురుసుగా ప్రవర్తించారని స్పష్టంగా అర్థం అవుతోంది. సినిమా ప్రమోషన్ కోసం ఢిల్లీ వెళ్లిన అల్లు అర్జున్… హైదరాబాద్ వచ్చే వరకు పోలీసులు నివాసం వద్ద వేచి ఉండటం…ఆ సమయంలో పుష్ప వేసుకున్న టీ షర్ట్ పై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఫ్లవర్ నహీ… ఫైర్ హు మై… అనే అక్షరాలతో వేసుకున్న టీ షర్ట్ సందర్భోచితంగా ఉందని అభిమానులు చర్చించుకుంటున్నారు.

ఈ రోజు ఉదయం జైలు నుంచి విడుదలయ్యాక గీతా ఆర్ట్స్ కార్యాలయం వెళ్లి… అక్కడి నుంచి ఇంటికి చేరుకున్నాడు. ఆ తర్వాత మిత్రులు, సన్నిహితులు నివాసానికి రావడంతో వారిని కలిసేందుకు వచ్చిన పుష్పరాజ్ వేసుకున్న టీ షర్ట్ పై ఐకాన్ స్టార్ అనే అక్షరాలు ఉన్నాయి.  అరెస్టు, విడుదల సమయంలో వేసుకున్న టీ షర్ట్స్ ప్రత్యర్థులకు మెసేజ్ ఇచ్చే విధంగా ఉన్నాయని చిత్రసీమలో చర్చ జరుగుతోంది.

నంద్యాల ఎన్నికల ప్రచారం దగ్గర నుంచే అల్లు అర్జున్ ను టార్గెట్ చేశారని ప్రచారం జరుగుతోంది. స్వతహాగా అల్లు అర్జున్ స్వతంత్ర బావాలు కలిగిన వ్యక్తి అని సన్నిహితులు చెపుతారు. పెళ్లి దగ్గరి నుంచి ఎన్నికల ప్రచారం వరకు… సినిమాల సెలక్షన్ నుంచి సినిమా వేడుకల వరకు కేవలం స్నేహానికి ప్రాధాన్యత ఇస్తాడని చెప్పుకుంటారు.

ఇక అల్లు అర్జున్ ను అరెస్టు చేయటంపై బీఆర్ ఎస్, బిజెపిలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి. ప్రభుత్వం కావాలనే ఇబ్బందులకు గురిచేస్తోందని నేతలు ఆరోపించారు. దీనిపై జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. పుష్ప అరెస్టు వెనుక కుట్ర కోణం ఉందని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీ పెద్దలు మెగా ఫ్యామిలీని అల్లు అరవింద్ కుటుంబంతో విడదీసేందుకు ఎత్తుగడ వేశారని విమర్శిస్తున్నారు.

అల్లు అర్జున్ వ్యవహారంలో సిఎం రేవంత్ రెడ్డి వ్యవహార సరళి విమర్శలకు దారితీసింది. ఆయన మాటల్లో అసహనం కొట్టొచ్చినట్టు కనిపించిందని విశ్లేషణలు జరుగుతున్నాయి. అరెస్టు కుట్ర కోణంలో నిజాలు తేలాల్సి ఉందని… అయితే పుష్ప టీ షర్ట్స్ మాత్రం ప్రత్యర్థులకు పుండు మీద కారం చల్లినట్టుగా మెసేజ్ ఇచ్చాయని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com