సినీ నటుడు మంచుమనోజ్ సోమవారం రాత్రి బాకారాపేట పోలీస్‌స్టేషన్‌లో హల్‌ఛల్ చేశారు. తనపాటికి తాను కుటుంబంతో ఓ ప్రైవేటు రిసార్ట్‌లో ఉంటే భాక్రాపేట ఎస్‌ఐ కొంత మంది పోలీసులతో వచ్చి తనను పోలీస్ స్టేషన్‌కి తీసుకువచ్చారని… ఎందుకు తీసుకు వచ్చారని అడిగితే సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారని, ఫోన్ చేస్తే ఎత్తడం లేదని… తనని ఎందుకు తీసుకువచ్చారో సమాధానం చెప్పాలని మంచు మనోజ్ పోలీస్ స్టేషన్‌లో భైఠాయించారు. అయితే పోలీసుల కధనం మరోలా ఉంది, భాక్రాపేట ఘాట్ రోడ్, ప్రైవేట్ రిసార్ట్ పరిసర ప్రాంతాల్లో రాత్రి గస్తీ చేస్తున్న సమయంలో కొంత మంది బౌన్సర్లు అక్కడ కనిపించారని వారిని వివరాలు అడిగి తెలుసుకుని మేము వచ్చేశామని కొంత సేపటి తరువాత మనోజే స్వయంగా పోలీస్ స్టేషన్ కి వచ్చి తనను అరెస్ట్ చేయడానికి మిమ్మల్ని ఎవరు పంపిచారో తెలుసు… నన్ను అరెస్ట్ చెయ్యండి అంటూ పోలీస్ స్టేషన్‌కి వచ్చి గొడవ చేస్తున్నాడని పోలీసులు చెపుతున్నారు. వాస్తవానికి గస్తీలో తారసపడిన బౌన్సర్లను ఎవరు ఏంటి అని విచారించామని అంతేకానీ తాము మనోజ్‌ని అరెస్ట్ చేయడానికి రాలేదని భాక్రాపేట పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ చెపుతున్నారు. మనోజ్ మాత్రం దాదాపు గంట పాటు పోలీస్ స్టేషన్లో హైడ్రామా చేసి ఉదయమే మళ్ళీ వస్తానని తన దగ్గరకు పోలీసులు ఎందుకు వచ్చారో చెప్పాలని, నేను రిసార్ట్ లో ఉంటే ఎందుకు వేధిస్తున్నారు..నా గురించి ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారో చెప్పాలని మనోజ్ అర్ధరాత్రి పోలీస్‌స్టేషన్ నుంచి ప్రైవేటు రిసార్ట్‌కు వెళ్లిపోయారు.
- Advertisement with us -