-
వ్యవసాయ మార్కెట్ల ద్వారా విక్రయించండి
-
రాష్ట్ర ప్రజల ఆశలు నెరవేర్చేందుకు ఆదాయాన్ని పెంచే మార్గాలు అన్వేషించండి
-
రెవెన్యూ రిసోర్స్ మొబలైజేషన్ సబ్ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
సామాన్యులకు ఇసుక అందుబాటులోకి తీసుకురావాలని, ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ప్రారంభించినట్టు.. రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ మార్కెట్లలోనూ ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు. శనివారం ప్రజాభవన్లో రెవెన్యూ రిసోర్స్ మొబైల్ జేషన్ సబ్ కమిటీ సమావేశం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన జరగగా సమావేశంలో మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ప్రజా ప్రయోజనాలకు ఉద్దేశించిన ఇసుక, మైన్స్ శాఖలను అత్యంత ప్రాధాన్యత కలిగినవి గా వివరించారు. ఇసుకకు సంబంధించి ఐటీడీఏలతో త్వరగా ఒప్పందం చేసుకోవాలని మంత్రులు సూచించారు.
ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, మై న్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్, రెవెన్యూ, ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎస్ఎంఏ రిజ్వి, ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ సురేంద్రమోహన్, రిజిస్ట్రేషన్ కమిషనర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి, ఇండస్ట్రీస్ కమిషనర్ విష్ణువర్ధన్, హౌసింగ్ ఎండి గౌతం, కమర్షియల్ టాక్స్ కమిషనర్ హరిత తదితరులు పాల్గొన్నారు.