ముఖ్యమైన పండగలు–పర్వదినాలు…
-
10, సోమవారం, మతత్రయ ఏకాదశి
-
14, శుక్రవారం, హోళికా పూర్ణిమ
మేషం… (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. నూతన వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు హాజరవుతారు.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. క్లిష్టసమస్యల నుంచి బయటపడతారు.రావలసిన సొమ్ము అందుతుంది. మీ అవసరాలు తీరతాయి.అందరితోనూ సంతోషంగా గడుపుతారు.
సంతానపరంగా మరింత ఆనందదాయకంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అపోహలు తొలగుతాయి. వేడుకలకు మీ ఇల్లు వేదిక కాబోతోంది. కొద్దిపాటి రుగ్మతలు తొలగుతాయి. మెరుగైన జీవనం సాగిస్తారు. వ్యాపారాలు గతం కంటే లాభసాటిగా ఉంటాయి. పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో కోరుకున్న అవకాశాలు దక్కవచ్చు. కొన్ని మార్పులు అదృష్టంగా మారవచ్చు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు మరింత ఉత్సాహం. అనుకోని ప్రయాణాలు. వృథా ఖర్చులు.11,12 తేదీల్లో కుటుంబంలో ఒత్తిడులు, సమస్యలు. కొన్ని వివాదాలు నెలకొని ఇబ్బందిపడతారు. ఆలోచనలు నిలకడగా ఉండవు.గణేశాష్టకం పఠించండి.
వృషభం… (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, వృగశిర 1,2 పాదాలు)
ముఖ్యమైన కార్యక్రమాలలోఆటంకాలు. మిత్రులతో అకారణంగా విరోధాలు. తీర్థయాత్రలు చేస్తారు. ప్రత్యర్థులు సమస్యలు సృష్టిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు నెమ్మదిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆర్థిక ఇబ్బందులు ఎదురై చికాకు పరుస్తాయి. కొత్తగా రుణాలు చేస్తారు. ఆస్తుల క్రయవిక్రయాలు కూడా అంతగా అనుకూలించవు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. సోదరులు, సోదరీల నుంచి ఒత్తిడులు. సంతానపరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. తరచూ వైద్యసేవలు పొందుతారు. వ్యాపారాల విస్తరణ కార్యక్రమాలు మధ్యలో విరమిస్తారు. ఉద్యోగాలలో ఆకస్మిక బదిలీలు. బా«ధ్యతలు మరింత పెరుగుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అవకాశాలు చేజారవచ్చు. శుభవర్తమానాలు. అదనపు ఆదాయం. వస్తులాభాలు.12,13 తేదీల్లో శుభవార్తలు వింటారు. అదనపు రాబడి అందుతుంది. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. లక్ష్మీస్తుతి మంచిది.
మిథునం… (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
పనులు అనుకున్న రీతిలో సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలోగౌరవం పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురుకావచ్చు. విలువైన వస్తువులు సేకరిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. అందరితోనూ సఖ్యత నెలకొని ఉత్సాహంగా గడుపుతారు. సంతానపరంగా మరింత సౌఖ్యం. వారి విషయంలోకొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. రుణభారాలు తొలగుతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం. కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో కోరుకున్న పదోన్నతులు రావచ్చు. పైస్థాయి వారి ప్రశంసలు అందుతాయి. రాజకీయవేత్తలు, కళాకారులకు మరిన్ని అవకాశాలు దక్కే సూచనలు. నిర్ణయాలు మార్చుకుంటారు. ప్రయాణాలలో అవాంతరాలు. ఆరోగ్య సమస్యలు.14,15 తేదీల్లో వృథా వ్యయం. మనశ్శాంతి లోపం. కొన్ని నిర్ణయాలు వాయిదా. విష్ణుధ్యానం చేయండి.
కర్కాటకం… (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)
ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులు పరిచయం కాగలరు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. ఆస్తుల వివాదాలు పరిష్కారమవుతాయి. గృహ, వాహనయోగాలు. కుటుంబంలోని అందరితోనూ ప్రేమానురాగాలు పంచుకుంటారు. రెండవ సంతాన విషయంలో శుభవార్తలు. వివాహాది వేడుకలు నిర్వహిస్తారు. ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు. మీరు కోరుకున్న డబ్బు అందుతుంది. కొంత నలత చేసినా వెంటనే ఉపశమనం లభిస్తుంది.
వ్యాపారాలలో లాభాలు అందుతాయి. భాగస్వాములతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. ఉద్యోగాలలో విశేష గుర్తింపు రాగలదు. ప్రమోషన్లు దక్కుతాయి. కళాకారులకు అవార్డులు దక్కుతాయి. బాధ్యతలు మరింత పెరుగుతాయి. దూర ప్రయాణాలు. ఒప్పందాలను వాయిదా వేస్తారు.9,10 తేదీల్లో మిత్రులతో కలహాలు. కుటుంబంలో సమస్యలు. దూరప్రయాణాలు. దుర్గాదేవిని పూజించండి.
సింహం… (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
అనుకున్న లక్ష్యాల వైపు సాగుతారు. విద్యార్థులు ఊహించని అవకాశాలు దక్కి ఉత్సాహంగా గడుపుతారు. ఎంతటి పనైనా అవలీలగా పూర్తి చేస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. పలుకుబడి మరింత పెరుగుతుంది. కాంట్రాక్టర్లకు శుభవార్తలు. కుటుంబంలోని అందరితోనూ సంతోషంగా గడుపుతారు. మీ అభిప్రాయాలకు మరింత ఆదరణ లభిస్తుంది. స్థిరాస్తి విషయంలో సోదరులతో అంగీకారానికి వస్తారు. ఇంటి నిర్మాణాలపై దృష్టి సారిస్తారు. ఊహించని రీతిలో డబ్బు చేకూరుతుంది. తరచూ ధనలాభాలు కలుగుతాయి. ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. వైద్యసేవల నుంచి విముక్తి లభిస్తుంది. వ్యాపారాలలో కొత్త భాగస్వాములతో విస్తరిస్తారు. పెట్టుబడులకు తగిన లాభాలు తథ్యం. ఉద్యోగాలలో విధి నిర్వహణలో అవాంతరాలు తొలగుతాయి. పైస్థాయి నుంచి ప్రశంసలు అందుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు పురస్కారాలు.
కుటుంబంలో ఒత్తిడులు. అయినవారితో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా సాగవు. 13,14 తేదీల్లో చర్చలలో విఘాతం, ధనవ్యయం. నిర్ణయాలు మార్చుకుంటారు. శివాష్టకం పఠించండి.
కన్య… (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)
ముఖ్య కార్యక్రమాలలో ప్రతిబంధకాలు తొలగుతాయి. మిత్రులు మరింత చేయూతనందిస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. డబ్బుకు లోటు ఉండదు. రుణబాధలు తొలగుతాయి. ఆస్తుల వ్యవహారాల్లోనూ లబ్ధి చేకూరుతుంది. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. సంతానపరంగా నెలకొన్న ఇబ్బందులు తీరతాయి. బంధువుల సహాయం అందుతుంది. సోదరీల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కొన్ని రుగ్మతల నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో ప్రమోషన్లు రాగలవు. వి«ధి నిర్వహణలో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. రాజకీయవేత్తలు, కళాకారులకు విదేశీ పర్యటనలు ఉంటాయి. కొంత వృథా ఖర్చులు తప్పవు. కుటుంబంలో ఒత్తిడులు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం వద్దు.9,10 తేదీల్లో బంధువుల నుండి ఒత్తిడులు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఒప్పందాలు వాయిదా. విష్ణుధ్యానం చేయండి.
తుల… (చిత్త 3,4పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)
కొత్త పనులు చేపడతారు. స్నేహితులు మీకు వెన్నంటే ఉంటారు. కాంట్రాక్టులు సైతం దక్కుతాయి. విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. వాహన, గృహయోగాలు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. కుటుంబసమస్యలు తీరి ఉపశమనం లభిస్తుంది. భార్యాభర్తల మధ్య అపోహలు తొలగుతాయి. ప్రథమ సంతానం నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థికం ఇబ్బందులు నెలకొన్నా అవసరాలకు లోటు ఉండదు. ఏదో విధంగా డబ్బు సమకూర్చుకుంటారు. కొద్దిపాటి రుగ్మతలు తప్పకపోవచ్చు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. నూతన భాగస్వాములు చేరతారు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు సంభవం. పారిశ్రామికవేత్తలు సంస్థల విస్తృతిలో విజయం సాధిస్తారు. మానసిక అశాంతి. కుటుంబంలో గందరగోళం. ప్రయాణాలు వాయిదా పడతాయి. 14,15 తేదీలలో ఆకస్మిక ప్రయాణాలు. వివాదాలకు దూరంగా ఉండండి. కీలక నిర్ణయాలలో మార్పులు. గణేశాష్టకం పఠించండి.
వృశ్చికం… (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
కొన్ని పనులు శ్రమానంతరం పూర్తి కాగలవు. దూరప్రాంతాల నుంచి అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులు పరిచయమవుతారు. పూర్వపు మిత్రుల నుంచి ఆసక్తికర విషయాలు తెలుసుకుంటారు. అప్రయత్నంగా సొమ్ము అందుకుంటారు. రుణాలు తీరి ఊరట చెందుతారు. కుటుంబంలో రెండవ సంతాన వివాహ విషయంలో తుది నిర్ణయాలు తీసుకుంటారు. తండ్రి తరఫు వారితో తగాదాలు తీరతాయి. సోదరులు, సోదరీలతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం కొంత మెరుగుపడి ఉత్సాహంగా గడుపుతారు. వైద్యసేవలు విరమిస్తారు. వ్యాపారాలలో కొత్త భాగస్వాములతో విస్తరిస్తారు. పెట్టుబడులకు తగిన లాభాలుతథ్యం. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు సంభవం. ఉన్నతాధికారుల ఆదేశాల అమలులో విజయం సాధిస్తారు.రాజకీయవేత్తలు, కళాకారులకు సత్కారాలు జరుగుతాయి.11,12 తేదీల్లో బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఎంత శ్రమపడ్డా ఫలితం కనిపించదు. కావలసిన వారితో విభేదాలు. ఆదిత్య హృదయం పఠించండి.
ధనుస్సు… (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రత్యర్థులు అనుకూలురుగా మారి సహాయపడతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. ప్రముఖులు పరిచయం కాగలరు. విద్యార్థులు కొత్త అవకాశాలు దక్కుతాయి. రావలసిన సొమ్ము అందుతుంది. రుణభారాలు తొలగుతాయి. కుటుంబంలోని అందరి ప్రేమను పొందుతారు. రెండవసంతానం ఉద్యోగయత్నాలు సానుకూలమై ఊరటచెందుతారు. బంధువుల ఇంట వేడుకలకు హాజరవుతారు. కొద్దిపాటి రుగ్మతల నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుతాయి. పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగాలలో కోరుకున్న ప్రమోషన్లు రాగలవు. ఉన్నతాధికారుల ఆదరణ పొందుతారు.
రాజకీయవేత్తలకు పదవీయోగం. సన్మానాలు. బంధువుల ద్వారా సమస్యలు రావచ్చు. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలు.10,11 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. ధనవ్యయం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
మకరం… (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)
కొత్త పనులకు శ్రీకారం చుడతారు.శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.నూతన వ్యక్తుల పరిచయం.కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. ఆ«ధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు సత్తా చాటుకుంటారు. ఉద్యోగయత్నాలు సానుకూలమవుతాయి. బాకీలు వసూలై ఆర్థిక పరిపుష్టి కలుగుతుంది. రుణబాధలు తొలగుతాయి. కుటుంబసభ్యులతో విభేదాలు తొలగుతాయి. ఆసక్తికర విషయాలు తెలుసుకుంటారు. సంతానం నుంచి ఎదురైన సమస్యలు పరిష్కారమవుతాయి. తృతీయ సంతానం విదేశీ పర్యటనలు ఖరారు కాగలవు. కొంత నలత చేసినా ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలు క్రమేపీ వృద్ధిబాటలో నడుస్తాయి. లాభాలు తథ్యం. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉండవచ్చు. ఉన్నతాధికారులు మీ పనితీరుపై ప్రశంసిస్తారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అవార్డులు రాగలవు. ఇంటాబయటా సమస్యలు. బంధువులతో అకారణంగా తగాదాలు. కష్టానికి ఫలితం ఉండదు.12,13 తేదీలలో ముఖ్య ఒప్పందాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. మానసిక అశాంతి. శివపంచాక్షరి పఠించండి.
కుంభం… (ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం. ముఖ్యమైన కార్యక్రమాలలోవిజయం. ఆప్తులు, శ్రేయోభిలాషుల సహాయసహకారాలు అందుతాయి. కాంట్రాక్టర్లకు అనుకూల సమయం. ఆ«ధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇంటి నిర్మాణాలు చేపడతారు. పోటీపరీక్షల్లో నిరుద్యోగులకు విజయం. అప్రయత్నంగా సొమ్ము అందుతుంది. రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. సంతానం నుంచి కీలక సమాచారం రాగలదు. ఒకరి వివాహప్రయత్నాలు కలిసివస్తాయి. సోదరులు, సోదరీల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆస్తుల వ్యవహారాలలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం మరింత మెరుగుపడి ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలలో కొత్త భాగస్వాముల నుంచి పెట్టుబడులు అందుతాయి. లాభాలు ఊరిస్తాయి. ఉద్యోగాలలో ప్రమోషన్లు దక్కుతాయి. మీకంటూ ప్రత్యేకత చాటుకుంటారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు అనుకున్నది సాధిస్తారు.
బాధ్యతలు మరింత పెరుగుతాయి. మీ అంచనాలు తప్పుతాయి. ఆరోగ్య సమస్యలు.11,12వ తేదీలో వివాదాలు. మానసిక అశాంతి. కీలక నిర్ణయాలు. దూరప్రయాణాలు. నృసింహస్తోత్రాలు పఠించండి.
మీనం… (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరభాద్ర, రేవతి)
కొత్తపనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలోగౌరవం పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి.
ప్రముఖులు పరిచయమవుతారు. ప్రత్యర్థులు సైతం మీకు సహాయపడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇంతకాలం పడిన ఇబ్బందులు తొలగుతాయి. వద్దంటే డబ్బుగా ఉంటుంది. బాకీలు వసూలవుతాయి. కుటుంబంలోని అందరితోనూ ప్రేమను పంచుకుంటారు. సంతానం నుంచి మరింత సౌఖ్యం. వారి అభివృద్ధికి తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తాయి. కొద్దిపాటి నలత చేసినా ఉపశమనం పొందుతారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో పైస్థాయి నుంచి ప్రశంసలు. విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. రాజకీయవేత్తలు, కళాకారులకు నూతనోత్సాహం.మీ నైపుణ్యం వెలుగులోకి రాదు. శ్రమ పడ్డా ఫలితం శూన్యం. వ్యయప్రయాసలు.14,15 తేదీలలో మిత్రులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఖర్చులు పెరుగుతాయి. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.