28.2 C
Hyderabad
Friday, September 18, 2026

Live Video

spot_img

ఫైనల్ ఫైట్‌కు ఆల్‌సెట్.. ఛాంపియన్ కాబోయేది ఎవరు?

ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ ఫైట్‌కు అంతా సిద్ధమైంది. ప్రస్తుతం దేశమంతా మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుందా? అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. భారత్ తన జైత్రయాత్రను కంటిన్యూ చేస్తుందా? ఫైనల్స్‌లో కివీస్‌ను మట్టి కరిపిస్తుందా? అన్ని మ్యాచ్‌ల్లో లాగానే ఈ మ్యాచ్‌లో కూడా టాస్ ఓడి కప్పును గెలుస్తామా? ఛాంపియన్స్ ట్రోఫీలో 25 ఏళ్ల పగకు ప్రతీకారం తీర్చుకుంటామా? ఇలా అనేక ప్రశ్నలు ఇప్పుడు టీమిండియా ఫ్యాన్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

పిచ్ రిపోర్ట్..

దుబాయ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌కు భారత్- పాకిస్థాన్‌ మధ్య జరిగిన తాలుకూ పిచ్‌ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. సో మ్యాచ్ స్లోగానే జరుగుతుందని తేలిపోయింది. ఎక్కువగా పరుగులు చేసే అవకాశం లేదు. కానీ ఎక్కువ పరుగులు చేసి టీమ్‌కే ఎక్కువ గెలుపు అవకాశాలు ఉంటాయనేది మాత్రం వాస్తవం.

వెదర్ రిపోర్ట్..

ప్రస్తుతం దుబాయ్‌ వేదికగా మ్యాచ్ జరుగుతుంది కాబట్టి వర్షాలు పడే సూచన దాదాపుగా లేనట్టే. వాతావరణ నిపుణులు కూడా మ్యాచ్‌కు ఎలాంటి అటంకాలు ఉండవని చెప్పేశారు. ఒకవేళ మ్యాచ్‌కు వరణుడు ఆటంకం కలిగించినా రిజర్వ్ డే ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లమ్.

కివీస్ లెక్కలేంటి?

ప్రస్తుతం న్యూజిలాండ్ టీమ్ ఫుల్ ఫామ్‌లో ఉంది. అందుకే అస్సలు తక్కువగా అంచనా వేసే అవకాశం లేదు. కేవలం లీగ్‌ దశలోనే భారత్ చేతిలో ఓడింది. కానీ మిగతా మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేశారు కివీస్ ప్లేయర్లు. రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, ఫిలిప్స్, మిచెల్ అద్భుతంగా ఆడుతున్నారు. శాంట్నర్ స్పిన్ మంత్రం కివీస్‌కు అదనపు బలంగా మారింది.

భారత్ జైత్రయాత్ర కొనసాగుతుందా?

టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటి వరకు తన జైత్రయాత్రను కొనసాగిస్తూ వస్తోంది. అయితే 2023 వరల్డ్ కప్ సీన్స్‌ను మాత్రం రీపిట్ చేయవద్దని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. అప్పుడు కూడా వరుసగా గెలుస్తూ వచ్చిన టీమిండియా.. అసలైన ఫైనల్ ఫైట్‌లో మాత్రం ఆసీస్ చేతిలో ఓడింది. కానీ ఈసారి అలాంటి పరిస్థితి రావొద్దని కోరుకుంటున్నారు. టీమ్ ఇండియా కూడా పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌లో కూడా నలుగురు స్పిన్నర్లను బరిలోకి దించే అవకాశాలే ఉన్నాయి. టీమ్‌లో కూడా పెద్దగా మార్పులు ఉండే అవకాశం కనిపించడం లేదు.

బ్యాటర్లు రాణిస్తారా?

ప్రస్తుతం ఓపెనర్లు కాస్త తడబడినా.. వన్ డౌన్‌లో వచ్చే కోహ్లీతో పాటు మిడిల్ ఆర్డర్‌ దూకుడుగా ఆడుతుండటంతో టీమిండియా గెలుస్తూ వస్తోంది. అయితే ఫైనల్స్ లో మాత్రం ఓపెనర్లు ఎక్కువసేపు క్రీజులో నిలదొక్కుకోవాల్సిన అవసరం ఉంది.

స్పిన్నర్లు రాణించాల్సిందే..

ఫైనల్ ఫైట్‌కు సెలెక్ట్ చేసిన పిచ్ పూర్తిగా స్పిన్నర్లకు అనుకూలమన్న చర్చ జరుగుతోంది. దీంతో మరోసారి వరుణ్ మాయ చేయాలని అంతా కోరుకుంటున్నారు. మరి మిస్టరీ బౌలర్ ఏం చేస్తాడనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com