ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొదటి సారి సీయం అయినప్పుడు ఎంత తపనతో పని చేశారో ఇప్పుడు కూడా అదే కమిట్మెంట్ తో ముందకు వెళుతున్నారని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. బుధవారం ప్రారంభమైన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ 1994 నుంచి అంటే దాదాపు 30 ఏళ్ళ నుంచి చంద్రబాబుతో ప్రయాణం చేస్తున్నానని ఆయన సూచనలు, సలహాలకు అనుగుణంగా కార్యక్రమాలను అమలు చేద్దాంమని చెప్పారు. కూటమి ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చిన అప్పు పది లక్షల కోట్లని… 99 శాతం రాష్ట్ర ఆదాయం జీతభత్యాలకే సరిపోతోందిని అన్నారు. ఒకవైపు అప్పులు, ఆగిపోయిన ప్రాజెక్టులు, మరోవైపు ప్రజల ఆకాంక్షలు మరో వ్యక్తి అయితే నిద్రపోలేని పరిస్ధితి కానీ చంద్రబాబు ప్రజా క్షేమమే ధ్యేయంగా కష్టపడుతున్నారని కొనియాడారు. పది యూనివర్శిటీల్లో నేర్చుకోలేనిది చంద్రబాబు వద్ద నేర్చుకోవచ్చు, ఆయన దగ్గర పనిచేయడం మనందరికీ గొప్ప అవకాశమని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ప్రతి రూపాయి సంపాదించడానికి ఎంతో కష్టపడుతున్నామని మిగిలిన శాఖలు కూడా ప్రతి రూపాయి ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేయాలని కోరారు.
- Advertisement with us -