భారత్ లో నెత్తుటి ధారాలు పారించిన లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కుక్క చావు చచ్చాడు. భారత సైన్యం జరిపిన దాడుల్లో హఫీజ్ సయీద్ హతమైనట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ తో ఇండియన్ ఆర్మీ గురిచూసి మరీ ఈ ఉగ్ర నేతను మట్టుబెట్టింది. భారత్ లో జరిగిన అనేక ఉగ్ర దాడుల్లో హఫీజ్ సయీద్ హస్తం ఉంది. ఎందరో ముష్కరులను తయారు చేసి వారిని భారత్ పైకి ఉసిగొల్పే ఈ మృగం.. మరణించడం ఇండియన్ ఆర్మీకి ఘన విజయం.
ముంబయి మారణహోమం సూత్రధారి లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్ కు పహల్గాం దాడి జరిగినప్పటి నుంచి పాక్ ప్రభుత్వం భద్రత భారీగా పెంచింది. లాహోర్‌లో అతడి నివాసం చుట్టూ సైన్యం, ఐఎస్ఐ నిఘా పెట్టాయి. నాలుగు రెట్లు అధికంగా భద్రత కల్పించడంతో భారత్ అనుమానాలు బలపడ్డాయి. పహల్గామ్ ఉగ్రదాడికి హఫీజ్ సయీద్‌కు సంబంధం ఉందనే కోణంలో భారత నిఘా వర్గాలు దృష్టి సారించాయి. పహల్గామ్ దాడికి ప్రతీకారంగా సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారత్ రద్దుచేస్తే… నీళ్లు ఆపేస్తే మీ శ్వాస ఆపేస్తామని హఫీజ్ ఇటీవల బెదిరింపులకు దిగాడు.
హఫీజ్ సయీద్ లాహోర్‌లోని రద్దీగా ఉండే ప్రాంతంలో నివసిస్తున్నాడు. అతడి ఇంటి చుట్టూ పాక్ ఆర్మీ, ఐఎస్ఐ, లష్కరే ముఠా నిరంతరం కాపలా కాస్తున్నాయి. డ్రోన్ల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అంతేకాదు, ఇంటి చుట్టూ 4 కిలోమీటర్ల పరిధిలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసినట్టు పాక్ జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ప్రస్తుతం హఫీజ్ సయీద్ ఎక్కడ చనిపోయాడు అనేది తెలియాల్సి ఉంది.