22 C
Hyderabad
Friday, November 6, 2026

Live Video

spot_img

పిల్లలకు, షాపులకు తమిళ పేర్లు పెట్టండి!!

  • తమిళులకు స్టాలిన్ పిలుపు
  • తమిళ భాష సంపన్నమైన భాష అని కితాబు
  • పుట్టిన పిల్లలు, షాపులకు తమిళ భాషలో పేర్లు పెట్టాలి
  • పైగా షాపులకు మంచి గుర్తింపు వచ్చే ఛాన్స్ ఉందన్న సీఎం
  • కొన్నాళ్ల క్రితం మోడీ కూడా అదే పిలుపు

తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఓ కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. తల్లిదండ్రులు, స్థానిక వ్యాపారులు తమ షాపులకు, పిల్లలకు ఆంగ్ల పేర్లు కాకుండా తమిళ పేర్లు పెట్టాలంటూ పిలుపునిచ్చారు. తమిళభాషను పటిష్టం చేయాల్సిన అవసరముందని ఆయన అంటున్నారు. తాను ఏ పెళ్లికి వెళ్లినా వధూవరులను ఆశీర్వదిస్తూ పుట్టబోయే బిడ్డకు చక్కటి తమిళపేరును పెట్టాలని కోరుతున్నట్లు చెప్పారు. తమిళనాడులో ఉన్నవారు తమిళులే అయినా ఆంగ్ల పేర్లు పెట్టుకోడం తగదని ఆయనంటున్నారు. అలాగే స్థానిక వ్యాపారులు కూడా ఇంగ్లీష్‌ పేర్లకు బదులు తమిళ పేర్లు పెట్టాలని వ్యాపార సంస్థలు కూడా పిల్లల్లాంటివేనని అన్నారు. తమిళభాష ఎంతో సంపన్నమైనదని, వైవిధ్యమైన పేర్లను పెట్టుకోవచ్చని అలాగే షాపుకు గుర్తింపు వస్తుందని స్టాలిన్ అన్నారు. ఆంగ్లంలో ఉన్న షాపుల పేర్లను కనీసం తమిళంలోనైనా రాయాలని ఆయన పట్టుబడుతున్నారు. తమిళభాష గుర్తింపుకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ నెల్లాళ్ల క్రితం రామేశ్వరం లో జరిగిన ర్యాలీలో ప్రధాని మోడీ కూడా కోరారు. తమిళ భాష ఎంతో గర్వించదగినదని ఆయనన్నారు. తమిళ భాషను గర్వంగా చెప్పుకోవాలంటే కనీసం సంతకాలైనా ఆ భాషలో పెట్టాలని అప్పట్లోనే మోడీ కోరారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో స్టాలిన్ వ్యూహాత్మకంగా ప్రాంతీయ భాష, ప్రాంతీయ తత్వం పై పట్టు బిగించేందుకు సిద్దపడినట్లుగా కనిపిస్తోంది. అయితే విచిత్రం ఏంటంటే స్టాలిన్‌ అనే పేరు తమిళ పేరు కాకపోవడం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com