35.2 C
Hyderabad
Friday, May 22, 2026

Live Video

spot_img

టెస్ట్‌లకు రోహిత్ రిటైర్మెంట్

ఇంగ్లండ్‌తో జరిగే టెస్ట్‌ సిరీస్‌ ముందు షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు టీమిండియా కెప్టెన్‌  రోహిత్ శర్మ. టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించాడు హిట్ మ్యాన్. ఇన్‌ స్టా స్టోరీ ద్వారా తన రిటైర్మెంట్‌ను అనౌన్స్‌ చేశాడు రోహిత్.. ఇప్పటికే టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్. ఇప్పుడు టెస్ట్‌లకు కూడా రిటైర్మెంట్ ఇచ్చేశాడు. తన కెరీర్‌లో67 టెస్టులు ఆడిన రోహిత్‌ 4 వేల 301 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు.. 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.  24 టెస్ట్‌ మ్యాచ్‌లను కెప్టెన్‌గా వ్యవహరించాడు.

టెస్ట్‌ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నాను. వైట్ బాల్‌ గేమ్‌లో దేశానికి ప్రాతినిథ్యం వహించడం గర్వంగా ఉందని.. ఇన్నేళ్లుగా తనకు మద్దతిచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.. ఇకపై వన్డేలలో కొనసాగుతా.. అని స్టోరీలో రాసుకొచ్చాడు రోహిత్. బీసీసీఐ కూడా రోహిత్ రిటైర్మెంట్‌పై స్పందించింది. థ్యాంక్యూ కెప్టెన్ అంటూ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టింది. వన్డేల్లో రోహిత్ సారథ్యం కొనసాగుతుందని తెలిపింది.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఘోర వైఫల్యం తర్వాత రోహిత్ శర్మపై చర్యలు తీసుకుంటారన్న ప్రచారం జరిగింది. కానీ బీసీసీఐతో జరిగిన చర్చల తర్వాత అలాంటిదేం ఉండదన్న క్లారిటీ వచ్చింది. కెప్టెన్‌ను మారుస్తారని ముందు నుంచే ఊహాగానాలు ఉన్నాయి.  రోహిత్ ఈ సిరీస్‌ ఆడతాడనే నమ్మకం ఉండేది. బీసీసీఐ కూడా రోహిత్‌కు అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగా ఉందనే తెలిసింది. కానీ రోహిత్ ఇప్పుడు అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించాడు.

రోహిత్ టెస్ట్‌ మ్యాచ్‌లకు రిటైర్మెంట్‌ ప్రకటించడానికి ముందే కొన్ని కీలక పరిణామాలు జరిగాయి. ఇంగ్లండ్ సిరీస్‌కు సెలక్షన్ కమిటీ కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేయనుందన్న ప్రచారం జరిగింది. అంతలోనే రోహిత్ శర్మ ఈ ప్రకటన చేశాడు. జూన్ 20 నుంచి ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్ ఆడనుంది టీమ్ ఇండియా. ఇప్పుడు కొత్త కెప్టెన్ సారథ్యంలో ఈ మ్యాచ్‌లు ఆడనుంది. ఈ ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో రోహిత్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌గా ఆడతాడని ప్రచారం జరిగింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com