కొన్నాళ్ల పాటు తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన, సంచలనంగా మారిన లేడీ అఘోరి అలియాస్ శ్రీనివాస్ పెళ్లి చేసుకున్న వీడియో సోషల్ మీడియా లో వైరల్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వర్షిని అనే యువతని లేడీ అఘోరి పెళ్లి చేసుకుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మరఓసారి లేడీ అఘోరీ అలియాస్ శ్రీనివాస్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.
ఇప్పటికే పలు వివాదాలకు కేంద్రంగా మారిన అఘోరీ ఇప్పుడు పెళ్లి చేసుకొని మరో సంచలనానికి తెర లేపింది. అది కూడా ఏపీకి చెందిన వర్షిణి అనే యువతిని గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకోవడం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది. ప్రస్తుతం లేడీ అఘోరీ, వర్షిణి పెళ్లికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓ చిన్న ఆలయంలో అఘోరీ, వర్షిణీ మెడలో తాళికట్టినట్లు తెలుస్తోంది. ఇద్దరూ ఒకరికొకరు దండలు మార్చుకున్నారు. అనంతరం తలంబ్రాలు పోసుకోవడంతో పాటు ఏడడుగులు కూడా కలిసి నడిచిన దృశ్యాలు ఆ వీడియోలో కనిపిస్తున్నాయి.
అక్కడే ఉన్న పలువురు భక్తులు ఉత్సాహంగా భక్తి పాటలు పాడుతూ వారిని ఆశీర్వదించారు.
కాగా నందిగామలో వివస్త్రగా ఉన్న సమయంలో వర్షిణీ ముందుకొచ్చి అఘోరీకి సాయం చేసింది. అనంతరం వారి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే అఘోరీ, వర్షిణీని గుజరాత్‌లోని సౌరాష్ట్రకు తీసుకెళ్లింది. అయితే, తమ కుమార్తెకు లేనిపోని మాయమాటలు చెప్పి అఘోరీనే ఎత్తుకెళ్లాడంటూ వర్షిణీ కుటుంబ సభ్యులు రెండు రాష్ట్రాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులే స్వయంగా గుజరాత్‌కు వెళ్లి వర్షిణీకి నచ్చజెప్పి ఇంటికి తీసుకువచ్చారు. కొన్నాళ్లు బాగానే ఉన్న వర్షిణి.. మళ్లీ ఇంట్లో నుంచి చెప్పాపెట్ట కుండా వెళ్లిపోయింది. రెండు రోజుల క్రితం అఘోరీతో పెళ్లితో సంచలనంగా మారింది.