28.2 C
Hyderabad
Wednesday, September 16, 2026

Live Video

spot_img

పోలీసులకు కేటీఆర్ వార్నింగ్

పోలీసుల తీరుపై మరోసారి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. కొందరు పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల వ్యవహరిస్తున్నారని అందరి వివరాలు సేకరిస్తున్నామని తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆయన తీవ్ర స్వరంతో పోలీసులను హెచ్చరించారు. నల్గొండలో జరిగిన టిఆర్ఎస్ రైతు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పోలీసులను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరును స్థానిక నేతలు కేటీఆర్‌ దృష్టి తీసుకొచ్చారు. రైతు ధర్నా వేదికగా కేటీఆర్ పోలీసులు ఉద్దేశించి మాట్లాడుతూ అతిగా వ్యవహరించవద్దని సూచించారు.  ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నవాళ్లు పార్టీ కార్యకర్తలుగా మారవద్దని సూచించారు. అయితే కేటీఆర్ ఈ కామెంట్స్ ఫస్ట్ టైం చేయడం లేదు ఇటీవల చాలా ప్రాంతాల్లో కేటీఆర్ పోలీసులను ఉద్దేశించి ఈ రకమైన కామెంట్స్ రెగ్యులర్‌గా చేస్తున్నారు.  జిల్లాలో బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని నేతలు పలు సందర్భాల్లో పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఈ రకమైన కామెంట్స్ ని చేయడం వల్ల స్థానికంగా నేతలకు ధైర్యం లభిస్తుందని ఉద్దేశంతోనే కేటీఆర్ ఈ రకమైన కామెంట్స్ చేస్తున్నట్లుగా కనిపిస్తుందని నాయకులంటున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com