1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజునే సుప్రీంకోర్టు ఏర్పడినా దాని కార్యకలాపాలు మాత్రం జనవరి 28న ప్రారంభం అయ్యాయి. అంటే నేటి మంగళవారానికి సుప్రీం కోర్టు ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ కాలాన్ని ఇంగ్లీషులో ‘డైమండ్ జూబ్లీ’గా పిలుస్తారు. ప్రస్తుతం తిలక్‌మార్గ్‌లో ఉన్న సుప్రీం కోర్టు భవనాన్ని 1954 అక్టోబర్ 29న శంకుస్థాపన చేసి, 1958 ఆగస్టులో తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. అప్పటి నుంచి అదే భవనంలో సుప్రీంకోర్టు తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది.
థియేటర్లకు రాత్రి 11 తర్వాత 16 ఏళ్లలోపు పిల్లల్ని అనుమతించవద్దు: హైకోర్టు
సినిమా థియేటర్లకు పదహారేళ్లలోపు పిల్లలు వెళ్లే సమయం వేళలపై అన్ని వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు అప్పటి వరకు 16 ఏళ్లలోపు పిల్లల్ని రాత్రి 11 నుంచి ఉదయం 11 గంటల వరకు థియేటర్లకు అనుమతించవద్దని హైకోర్టు ఆదేశించింది. సినిమా టికెట్ల ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతిపై హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై సోమవారం జస్టిస్ బి. విజయ్‌సేన్ రెడ్డి విచారణ నిర్వహించారు.