భారత రాష్ట్రసమితి వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు హైకోర్టును ఆశ్రయించనున్నారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో శుక్రవారం క్వాష్ పిటిషన్ వేయనున్నారు. తనపై ఏసీబీ అధికారులు కేసునమోదు చేయడంతో కోర్టును ఆశ్రయించబోతున్నారు. ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో తనను ఏ1గా చేరుస్తూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంతో కేటీఆర్ తన కార్యాచరణపై దృష్టిపెట్టారు. ఈ క్రమంలోనే న్యాయ నిపుణులతో చర్చించారు. హైకోర్టులో శుక్రవారం ఉదయం కేటీఆర్ తరపు న్యాయవాదులు క్వాష్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.