టీమ్ ఇండియా సారథి చాలా పెద్ద త్యాగం చేశాడు. టీమ్ కోసం ఏకంగా తన బ్యాటింగ్ ఆర్డర్‌నే మార్చుకున్నాడు. ఇప్పటి వరకున్న ప్రచారమంతా నిజమే అని తేల్చేస్తూ ఈ స్టేట్‌మెంట్‌ను తానే స్వయంగా ఇచ్చేశాడు ఈ హిట్ మ్యాన్. అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో జరిగే రెండో టెస్టులో రోహిత్ ప్లేస్‌లో కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా దిగనున్నాడు. నిజానికి పెర్త్ టెస్టులో ఓపెనింగ్‌లో ఆడిన రాహుల్.. 26, 77 రన్స్ స్కోర్ చేశాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో జైస్వాల్‌తో కలిసి 201 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆ టెస్టులో ఇండియా 295 రన్స్ తేడాతో గెలిచింది. ఫస్ట్ టెస్టులో రోహిత్ శర్మ ఆడకపోవడంతో అతని ప్లేస్‌లో రాహుల్ వచ్చాడు. అయితే రోహిత్ రీ ఎంట్రీతో రాహుల్ పొజిషన్ మారుతుందనుకున్నారు. కానీ రోహితే తన బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చేసుకున్నాడు.
కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ను ఓపెన్ చేస్తాడు, మిడిల్ ఆర్డర్‌లో నేను ఆడతాను.. ఆ పొజిషన్‌లో ఆడడం నాకు ఈజీ కాదు, కానీ టీమ్ మంచి కోసం ఈ పొజిషన్‌ను త్యాగం చేయాల్సి వస్తుంది.. ఇది రోహిత్ ఇచ్చిన స్టేట్‌మెంట్. నిజానికి సెకండ్ టెస్ట్.. డే అండ్ నైట్ మ్యాచ్. ఈ పింక్ బాల్ టెస్ట్‌లో టాప్ ఆర్డర్ విఫలమయ్యే అవకాశం ఉందని, అందుకే రోహిత్ శర్మ మిడిల్ ఆర్డర్‌లో ఆడుతున్నాడని ఇటీవలే సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. వీటిని నిజం చేశాడు. ఇక హర్షిత్, నితీష్ రాణా పెర్త్‌లో తమ మొదటి మ్యాచ్ ఆడుతున్నారని నాకు ఎప్పుడూ అనిపించలేదు. అతని బాడీ లాంగ్వేజ్ చాలా బాగుంది. టెస్టు సిరీస్ గెలవాలంటే ఇలాంటి ఆటగాళ్లు కావాలన్నాడు రోహిత్.
రోహిత్ మిడిల్ ఆర్డర్ అన్నాడు. కానీ ఏ పోజిషనల్‌లో వస్తాడనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. సో.. ఇప్పుడు టీమిండియా బ్యాటింగ్ పోజిషన్స్ ఏ రకంగా ఉంటుందనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఆస్ట్రేలియా ప్రైమ్‌మినిస్టర్స్ ఎలెవన్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్-యశస్వీ ఇన్నింగ్స్‌ను ఓపెన్ చేశారు. రోహిత్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. డే-నైట్ టెస్టులో ఏ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడో చూడాల్సిందే. ప్రైమ్‌మినిస్టర్స్ ఎలెవన్‌తో జరిగిన ప్రాక్టీస్ టెస్ట్‌లో యశస్వి, రాహుల్ ఇన్నింగ్స్ ప్రారంభించి అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. మిడిలార్డర్‌లో రోహిత్ బ్యాటింగ్‌కు రావాలని రవిశాస్త్రితో సహా పలువురు మాజీ ఆటగాళ్లు సూచిస్తున్నారు. ఇకపోతే పెర్త్ టెస్టులో ప్లేయింగ్ ఎలెవన్ నుండి ముగ్గురు ఆటగాళ్లను తొలగించవచ్చని సమాచారం. ప్లేయింగ్ ఎలెవెన్‌లో అశ్విన్‌కి చోటు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురైల్, వాషింగ్టన్ సుందర్‌లను పక్కన పెట్టే అవకాశం ఉంది.