23.8 C
Hyderabad
Monday, August 24, 2026

Live Video

spot_img

తెలంగాణతల్లి విగ్రహ ప్రతిష్టాపనకు ముమ్మరంగా ఏర్పాట్లు

తెలంగాణ సచివాలయం ఆవరణలో ఏర్పాటుచేయబోతున్న తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపన ప్రాంతంలో జరుగుతున్న ఏర్పాట్లను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పరిశీలించారు. పనులు ఎక్కడిదాకా వచ్చాయని స్వయంగా పరిశీలించడంతో పాటు.. అక్కడ అధికారులను, సిబ్బందిని, పనిచేస్తున్న కూలీలతో మాట్లాడి పనుల పురోగతి గురించి తెలుసుకున్నారు. విగ్రహం ప్రతిష్టించడానికి సిద్ధం చేస్తున్న బేస్‌ పాయింట్‌, స్టేజ్‌ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అధికారులు మ్యాప్‌ల ద్వారా పనుల పురోగతిని సీఎం, డిప్యూటీ సీఎంకు వివరించారు. సీఎం, డిప్యూటీ సీఎం వెంట.. మంత్రి పొన్నం ప్రభాకర్‌, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎస్‌ శాంతికుమారి తదితరులు ఉన్నారు.

 

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com