క్రికెట్ ఇండియాలో ఓ క్రీడ మాత్రమే కాదు.. అదో మతం లాంటిది. క్రికేటర్లను దేవుళ్లలా ఆరాధించే వారిలో ఇండియన్స్ తర్వాతే ఎవరైనా. అలాంటి క్రికెటర్లు ఆటతోనే కాదు.. అనేక రూపాల్లో డబ్బు సంపాదిస్తారు. అది కూడా వందల కోట్లలో ఉంటుంది. మరి అలా సంపాదించే వారు అదే స్థాయిలో పన్ను చెల్లించాలి కదా. అసలు ఏఏ క్రికెటర్ ఎంత డబ్బు టాక్స్ రూపంలో చెల్లిస్తున్నాడని లెక్కలు తీస్తే చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి.
రన్ మెషిన్, కింగ్‌గా పేరు సంపాదించుకున్న విరాట్ కోహ్లీ.. అనేక రికార్డుల విషయంలోనే కాదు పన్ను చెల్లింపులో కూడా ముందు వరుసలో ఉన్నారు. 2023-24 ఆర్ధిక సంవత్సరంలో ఏకంగా రూ.66 కోట్ల ఇన్‌కమ్ టాక్స్ చెల్లించాడు విరాట్ కోహ్లీ. ఈ లెక్క ప్రకారం చూస్తే ఆయన ఆదాయం ఆ ఒక్క ఏడాదిలో సుమారు రూ.200 కోట్ల వరకు ఉంటుందని ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు. విరాట్ కోహ్లీ తర్వాతి స్థానాల్లో మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ, క్రికెట్ దేవుడుగా పేరుపొందిన సచిన్ టెండూల్కర్ ఉన్నారు.
బీసీసీఐ, ఐపీఎల్ కాంట్రాక్ట్‌లతో పాటు ఎండార్స్‌మెంట్, వెంచర్లు, యాడ్స్ ఇలా అన్ని కలుపుకొని క్రికెటర్లు కోట్లలో సంపాదిస్తున్నారు. వీటితో పాటు చాలా మంది క్రికెటర్లు చాలా వ్యాపారాలు కూడా చేస్తున్నారు.
విరాట్ కోహ్లీ రూ.66 కోట్లు
ఎంఎస్ ధోనీ రూ.38 కోట్లు
సచిన్ టెండూల్కర్ రూ.28 కోట్లు
సౌరవ్ గంగూలీ రూ.23 కోట్లు
హార్దిక్ పాండ్యా రూ.13 కోట్లు
రిషభ్ పంత్ రూ.10 కోట్లు
అజింక్య రహనే రూ.8 కోట్లు
జస్ ప్రీత్ బుమ్రా రూ.7 కోట్లు
శిఖర్ ధావన్ రూ.6 కోట్లు
కేఎల్ రాహుల్ రూ.5 కోట్లు