33.1 C
Hyderabad
Friday, October 23, 2026

Live Video

spot_img

హ్యాండ్‌ లగేజీ పాలసీ నిబంధనలలు కఠినతరం

  • ఇకపై విమానంలో క్యాబిన్ లగేజ్ పై ఆంక్షలు
  • హ్యాండ్ బ్యాగేజీ పాలసీలో ఎయిర్ ఇండియా కొత్త మార్పులు
  • సెక్యూరిటీ చెక్ పాయింట్ల దగ్గర రద్దీ తగ్గించడానికి కొత్త రూల్స్

విమాన ప్రయాణీకులకు ఎయిర్ ఇండియా కొత్త రూల్స్ అనౌన్స్ చేసింది. ఇకపై ఎంత అంటే అంత బ్యాగేజీ వెంట తీసుకెళ్లడానికి లేదు. విమాన ప్రయాణం చేయదలచిన ప్రయాణికులు ఇక బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ(బీసీఏఎస్‌) కొత్త హ్యాండ్‌ బ్యాగేజీ పాలసీని ఫాలో కావల్సిందే. ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీ చెక్‌పాయింట్ల వద్ద ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగిపోతుండడంతో హ్యాండ్‌ లగేజీ పాలసీకి సంబంధించి నిబంధనలను కఠినతరం చేయాలని బీసీఏఎస్‌, సీఐఎస్‌ఎఫ్‌ నిర్ణయించాయి. దీంతో వివిధ ఎయిర్‌లైన్లు కూడా ఈ కొత్త విధానాన్ని అమలు చేయక తప్పని పరిస్థితి ఎదురైంది. కొత్త బీసీఏఎస్‌ హ్యాండ్‌ బ్యాగేజీ పాలసీ ప్రకారం ప్రయాణికులు ఇకపైన విమానంలోకి తమ వెంట ఒక్క బ్యాగేజీని మాత్రమే తీసుకెళ్లడానికి అనుమతి ఉంటుంది.

ఫ్లయిట్  ఏదైనా రూల్ కామన్..

దేశీయ లేదా అంతర్జాతీయ విమానంతో నిమిత్తం లేకుండా ప్రయాణికుడు తన వెంట కేవలం ఒక హ్యాండ్‌ బ్యాగేజీని మాత్రమే విమానంలోకి తీసుకెళ్లగలడు. అదనపు బ్యాగేజీ చెక్‌ఇన్‌ కావలసిందే. ఎకానమీ లేదా ప్రీమియం ఎకానమీ తరగతిలో ప్రయాణించే ప్రయాణికులు తమ వెంట విమానంలోకి 7 కిలోల వరకు బరువున్న ఒక బ్యాగేజీని మాత్రమే తీసుకెళ్లాల్సి ఉంటుందని ఎయిర్‌ ఇండియా ప్రకటించింది. అయితే ఫస్ట్‌ లేదా బిజినెస్‌ క్లాస్‌లో ప్రయాణించే ప్రయాణికులు మాత్రం సుమారు 10 కిలోల వరకు బరువుండే ఒకే ఒక హ్యాండ్‌ బ్యాగేజీని తీసుకెళ్లవచచ్చని తెలిపింది. బ్యాగేజీ కొలతలను కూడా ఎయిర్‌ ఇండియా స్పష్టం చేసింది.

బ్యాగేజ్ కొలతలపై నిర్దిష్టమైన రూల్స్..

బ్యాగేజీ ఎత్తు 55 సెంటీమీటర్లు, పొడవు 40 సెంటీమీటర్లు, వెడల్పు 20 సెంటీమీటర్లు మించరాదని తెలిపింది. ఒక్కో ప్రయాణికుడి హ్యాండ్‌ బ్యాగేజీ చుట్టుకొలత 115 సెంటీమీటర్లు మించరాదని కూడా తెలిపింది. ఒకవేళ ప్రయాణికుడి హ్యాండ్‌ బ్యాగేజీ బరువు, విస్తీర్ణం పరిమితిని మించి ఉన్న పక్షంలో అదనపు చార్జీలు భరించక తప్పదని ఎయిర్‌లైన్స్‌ తెలిపింది. అయితే 2024 మే 2కి ముందు తమ టికెట్లను బుక్‌ చేసుకున్న ప్రయాణికులకు మాత్రం వెసులుబాటు కల్పిస్తున్నట్టు పేర్కొంది. ఎకానమీ క్లాస్‌ ప్రయాణికులు 8 కిలోల వరకు, ప్రీమియం ఎకానమీ క్లాస్‌ ప్రయాణికులు 10 కిలోల వరకు, ఫస్ట్‌ లేక బిజినెస్‌ క్లాస్‌ ప్రయాణికులు 12 కిలోల వరకు బరువుండే హ్యాండ్‌ బ్యాగేజీని తీసుకెళ్లవచ్చని ఎయిర్‌ ఇండియా పేర్కొంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com