25 C
Hyderabad
Tuesday, July 28, 2026

Live Video

spot_img

ఆగమ శాస్త్ర సలహా మండలిపై టీటీడీ వేటు

టీటీడీ పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పాలకమండలి రూ.5258.68 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. ఈమేరకు టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడు సమావేశం వివరాలు మీడియాకు వెల్లడించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇతర దేశాల్లోనూ శ్రీవారి ఆలయాలు నిర్మించాలని నిర్ణయం తీసుకున్న టిటిడి దీనికి సంబంధించిన విధి విధానలు త్వరలోనే వెల్లడిస్తామని చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు.

త్వరలో వీఐపీ బ్రేక్‌ దర్శన వేళల్లో మార్పులు చేస్తున్నట్టు టిటిడి చైర్మన్ ప్రకటించారు. శ్రీవారి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కమిటీ వేసి పరిరక్షిస్తామని తెలిపారు. సైన్స్‌ సిటీకి కేటాయించిన 20ఎకరాలు తిరిగి స్వాధీనం చేసుకుంటున్నామని, తిరుమలలో అనధికార హాకర్లపై త్వరలో చర్యలు చేపడతామని హెచ్చరించారు. టీటీడీ లో విధులు నిర్వహించేవారు హిందువులు మాత్రమే అయ్యిఉండాలన్న నిర్ణయానికి ఆమోదం తెలిపింది.

ఏపీలోని పలు పట్టణాలు, గ్రామాల్లో అర్థాంతరంగా ఆగిపోయి ఉన్న ఆలయ నిర్మాణాలను పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు చైర్మన్ తెలిపారు. ఆగమ శాస్త్ర సలహా మండలిపై టీటీడీ వేటు వేసింది. తిరుమలలో రూ.26 కోట్లతో 1,500 గదులకు మరమ్మతులు చేయనున్నట్టు… ముంతాజ్‌ హోటల్‌ అనుమతులు రద్దు చేశామని బీఆర్‌ నాయుడు పేర్కొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com