31.2 C
Hyderabad
Tuesday, September 15, 2026

Live Video

spot_img

కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఢిల్లీలో ఈ రోజు జరిగిన కేంద్రమంత్రి వర్గ సమావేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్రమంత్రి వర్గ నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ వెల్లడించారు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి కానుక ప్రకటించింది. కేంద్ర కేబినెట్‌ నిర్ణయాల 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి త్వరలో వేతన సంఘం చైర్మన్‌ నియామకం పూర్తవుతుందని వెల్లడించారు. చైర్మన్, ఇద్దరు సభ్యులతో కూడిన వేతన సంఘం సిఫారసులు… 2026 జనవరి ఒకటి నుంచి అమలులోకి వస్తాయని కేంద్రమంత్రి వెల్లడించారు.

స్పేస్‌ టెక్నాలజీని పెంపొందించేందుకు పలు పథకాలకు ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం…రోదసిలోకి మానవుడిని పంపే ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శ్రీహరికోటలో రూ.3,985 కోట్లతో థర్డ్‌ రాకెట్‌ లాంచ్‌ ప్యాడ్‌ నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది.

శ్రీహరికోటలో ఇప్పటికే రెండు లాంచ్ ప్యాడ్లు ఉండగా..ఎన్ జి ఎల్ వి ప్రయోగాలకు అనుగుణంగా మూడో లాంచ్ ప్యాడ్ ను ఏర్పాటు చేసేందుకు కేంద్రప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

విశాఖ ఉక్కు కార్మాగారానికి కేంద్ర ప్రభుత్వం సాయం ప్రకటిస్తుందని ప్రచారం జరిగినా అలాంటి నిర్ణయం ఏదీ వెలువడలేదు. మీడియా సమావేశంలో కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్ ను విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై విలేఖరులు ప్రశ్నించినా ఆయన జవాబు దాట వేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com