మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి నేపథ్యంలో జవహర్ లాల్ టెక్నలాజికల్ యూనివర్శిటీ పరిధిలో శుక్రవారం జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేశారు. ఈ మేరకు జెఎన్టీయుసీ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో వెల్లడించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాప సూచికంగా జవహర్ లాల్ టెక్నలాజికల్ యూనివర్శిటీతో పాటు విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న అన్ని అఫిలియేటెడ్ కళాశాలకు సెలవు ప్రకటించినట్లు రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు తెలిపారు. శుక్రవారం వాయిదా పడిన పరిక్షలు తిరిగి ఎప్పుడు నిర్వహిస్తామనే తేదీలను త్వరలో ప్రకటిస్తామని జేఎన్టీయూ రిజిస్ట్రార్ విడుదల చేసిన ప్రకటనలో చెప్పారు.