మాజీ ప్రధాని, ఆర్థిక రంగ నిపుణులు మన్మోహన్ సింగ్ (92) కొద్ది సేపటి క్రితం న్యూఢిల్లీలోని తుది శ్వాస విడిచారు. వ్యార్ధక్యం కారణంగా అనారోగ్యంతో బాధపడుతున్న మన్మోహన్ సింగ్ ని గురువారం సాయంత్రం హుటాహుటీన ఎయిమ్స్ అసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కొద్ది సేపటి క్రితమే మరణించారు. మన్మోహన్ సింగ్ దేశ ప్రదాన మంత్రిగా పది సంవత్సరాలు సేవలందించారు. 2004 నుంచి 2014 వరకూ ఆయన ప్రధానిగా కొనసాగారు. ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న కాలంలో తొలుతు ఆర్బీఐ గవర్నర్ గా ఉన్న మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారు. అదే పీవీ హయాంలో ఆయన క్యాబినేట్ లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆర్థిక సంస్కరణలను కొనసాగించారు. ఆ తరువాత ప్రధానిగా ఉన్న పదేళ్ళ కాలంలో కూడా మన్మోహన్ చాలా ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి అమలు చేశారు. 1991 నుంచి 2019 వరకూ ఐదు పర్యాయాలు అస్సాం రాష్ట్రం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన మన్మోహన్ ఆ తరువాత 2024 వరకూ రాజస్ధాన్ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు. మాజీ ప్రధాని మన్మోహన్ మృతితో రేపు కర్నాటక రాష్ట్రంలోని బెలగావిలో జరగాల్సిన ర్యాలీని రద్దు చేసుకున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్దివదేహాన్ని దర్శించుకోవడానికి బెలగావిలో ఉన్న కాంగ్రెస్ నాయకులు అందరూ హుటా హుటీని ఢిల్లీ బయలుదేరారు. మన్మోన్ సింగ్ మృతి పట్ల సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియింకా గాంధీలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమత్ షాలు సంతాపం ప్రకటించారు.