37.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

ఏఐసీసీ కార్యాలయానికి మాజీ ప్రధాని భౌతిక కాయం

మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని పార్టీ శ్రేణులు, ప్రజల సందర్శనార్ధం అక్బర్ రోడ్డులోని కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించనున్నారు. శనివారం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకూ ఏఐసీసీ కార్యాలయంలో ప్రజల సందర్శనార్ధం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భౌతికకాయం ఉంచనన్నారు. ప్రజల సందర్శన అనంతరం రాజ్ ఘాట్ సమీపంలో మన్మోహన్ సింగ్ అంతిమ సంస్కారాలు జరుగుతాయని కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో సహా నేతలందరూ ఏఐసీసీ కార్యాలయంలోనే మన్మోహన్ సింగ్ కు నివాళుల అర్పిస్తారు. పార్టీ నాయకలు, శ్రేణులు నివాళులు అర్పించిన తరువాత రాజ్ ఘాట్ సమీపంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అత్యక్రియలు జరుగుతాయి. అమెరికాలో నివశిస్తున్న మాజీ ప్రధాని కుమార్తె శుక్రవారం అర్ధరాత్రి భారత్ చేరుకోనున్నారు. శనివారం ఉదయం 8 గంటలకు ఏఐసీసీ కార్యాలయానికి మన్మోహన్ భౌతికకాయం తీసుకువస్తారు. అక్కడ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల సందర్శనార్ధం పది గంటల వరకూ మన్మోహన్ పార్థివదేహాన్ని ఉంచుతారు. అనంతరం పది గంటల ప్రాంతంలో అంతిమయాత్ర ప్రారంభమవుతుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com