- హైకోర్టులో కేటీఆర్ కు చుక్కెదురు
- కేటీఆర్ క్వాష్ పిటీషన్ కొట్టేసిన న్యాయస్ధానం
- జనవరి 9న ఏసీబీ ముందుకు కేటీఆర్
- అదేరోజు కేటీఆర్ అరెస్ట్ చేస్తారా…!
- కేటీఆర్‌కు ఈడి మరోసారి నోటీసులు
- జనవరి 16న హాజరుకావాలని ఆదేశం
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు జనవరి 9కి అత్యంత ప్రాధాన్యత గల రోజుగా మారింది… రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలకు ఆరోజు చాలా కీలకమైంది గానే చెప్పుకోవచ్చు… ఇక అసలు విషయానికొస్తే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజకీయ జీవితంలో అత్యంత కీలకమైన రోజుగా రానున్న చిరు మరి తొమ్మిది నుంచి చెప్పుకోవచ్చు… ఫార్ములా ఈ రేస్ కేసులో హైకోర్టులో కేటీఆర్ కు చుక్కెదురు కావడంతో ఇక నెక్స్ట్ ఏంటి అనే అంశం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తుంది… తనపై పెట్టిన కేసును కొట్టివేయాలని తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు మంగళవారం కొట్టేసింది… పిటీషన్ కోర్టు కొట్టు వేయడంతో కేటీఆర్ ను విచారించడానికి కానీ అరెస్ట్ చేయడానికి కానీ రంగం సిద్ధమైనట్టుగా చర్చ జరుగుతుంది… ఇప్పటికే ఈ కేసు కు సంబంధించి జనవరి 9న హాజరుకావాలని ఏసీబీ కేటీఆర్ కు నోటీసులు ఇచ్చింది… కేటీఆర్ అరెస్టుకు సంబంధించి హైకోర్టు ఎలాంటి ప్రొటెక్షన్ ఇవ్వకపోవడంతో ఆరోజు విచారణతో పాటు అరెస్టు చేస్తారన్న ఊహగానాలు బలంగానే వినిపిస్తున్నాయి… హైకోర్టు తీర్పు వెలబడిన వెంటనే కేటీఆర్ ఇంటికి పార్టీ సీనియర్ నేతలు అంతా వచ్చి భవిష్యత్తు కార్యాచరణ పై చర్చించారు.. న్యాయపరంగా ఎలా ఎదురుకోవాలని అంశంపై చర్చించారు.. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలన్న ఆలోచనలో కేటీఆర్ ఉన్నట్లుగా తెలిసింది.
మరోవైపుఈ కేసులో సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం. కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉండడంతో ముందుగానే అలర్ట్ అయిన తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం వాదనలు విన్న తర్వాతే కేటీఆర్ పిటిషన్ పై నిర్ణయం తీసుకోవాలని కేవియేట్ వేసింది… అదేవిధంగా ఈ డి కూడా ఈ కేసులో కేటీఆర్ కి మరోసారి సమన్లు జారీ చేసింది ఈ నెల 16న హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది… ఈ మొత్తం వ్యవహారాన్ని రాజకీయ కుట్రగానే చూపాలన్న ఆలోచనలు బిఆర్ఎస్ ఉన్నట్లుగా కనిపిస్తుంది. కేటీఆర్ అరెస్ట్ అనువార్యమైతే రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి కార్యాచరణ రూపొందించాలని అంశంపై ఒకటి రెండు రోజుల్లో టిఆర్ఎస్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది… మొత్తానికి జనవరి 9న ఏం జరుగుతుందని టెన్షన్ రాజకీయ వర్గాల్లో కనిపిస్తుంది.