26.7 C
Hyderabad
Monday, April 20, 2026

Live Video

spot_img

జనవరి 8న మహాకుంభమేళాకు ప్రారంభం కానున్న టీటీడీ కళ్యాణ రథం

ప్రయోగ్‌రాజ్‌లో శ్రీవారి నమూనా ఆలయం… టీటీడీ ఈఓ

మహాకుంభమేళాకు వచ్చే భక్తులకు తిరుమల శ్రీవేంకటేశ్వరుడి దర్శన భాగ్యం కల్పించాలని ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రయోగ్‌రాజ్‌లో వెంకటేశ్వరస్వామివారి నమూనా దేవాలయం నిర్మిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్ధానం కార్యనిర్వహణాధికారి శ్యామలరావు తెలిపారు. జనవరి 8వ తేదీ బుధవారం ఉదయం 7గంటలకు శ్రీవారి ఆశీర్వాదాలతో తిరుమల నుంచి ప్రయోగ్‌రాజ్‌కు కళ్యాణ రథం ప్రారంభమవుతుందని టీటీడీ ఈఓ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో మీడియా ప్రతినిధులతో ఈఓ మాట్లాడుతూ జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఈ మహా ధార్మిక కార్యక్రమం జరుగుతుందని, ప్రయాగ్‌రాజ్‌కు ఆనుకుని ఉన్న సెక్టార్ 6, భజరంగ్ దాస్ రోడ్డులో 2.89 ఎకరాల స్థలంలో నమూనా ఆలయం రాబోతోందని పేర్కొన్నారు. ఉత్తరాది భక్తులు శ్రీవేంకటేశ్వర స్వామివారి వైభవాన్ని తిలకించేందుకు తిరుమల తరహాలో కైంకర్యములు, ఉత్సవాలు నిర్వహిస్తామని, ప్రతిరోజు సుప్రభాతం నుంచి ఏకాంత సేవ వరకు నిర్వహించనున్నట్లు వివరించారు.

జనవరి 18, 26, ఫిబ్రవరి 3, 12 తేదీల్లో శ్రీవారి కల్యాణాన్ని కూడా టీటీడీ నిర్వహిస్తోందని తెలిపారు. మహా కుంభమేళా కోసం, ఆలయ కార్యకలాపాలను నిర్వహించడానికి మరియు సందర్శకులకు అధిక సంఖ్యలో వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించడానికి టిటిడి నుండి వివిధ విభాగాలకు చెందిన అర్చకులు, వేద పండితులు మరియు సిబ్బందితో కూడిన బృందాన్ని టిటిడి నియమించిందని ఈఓ శ్యామలరావు చెప్పారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com