కడప జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మూడోరోజు పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ పులివెందులలోని క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్భార్ నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రజాదర్బార్ ఉంటుందని ప్రకటించారు. ఉదయం పది గంటలకు ప్రజాదర్బార్ ప్రారంభమయ్యింది. అయితే, వైఎస్ జగన్‌ను చూసేందుకు, ఆయనకు పలు వినతులు సమర్పించుకునేందుకు జనం భారీగా తరలివచ్చారు. దీంతో, క్యాంపు కార్యాలయం అభిమానుల రద్దీతో నిండిపోయింది. జగన్‌ను కలిసేందుకు, తమ సమస్యలు చెప్పుకునేందుకు స్థానికులు ఒక్కసారిగా తరలిరావడంతో తోపులాటలో క్యాంపు ఆఫీసులోని అద్దాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడమే ఈ తోపులాటకు కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అద్దాలు ధ్వంసమయ్యాయన్న నెపంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. వచ్చిన ప్రజలను కంట్రోల్ చేయలేక రోప్‌తో జులుం ప్రదర్శించారు. దీంతో, మరింత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అసలు, జగన్ పర్యటన ఉంటుందని, ప్రజాదర్భార్ నిర్వహిస్తారని ముందుగానే సమాచారం ఉన్నప్పటికీ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ఈ పరిస్థితికి కారణమని పులివెందుల వాసులు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
- Advertisement with us -