భారత క్రికెటట్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ శాంటాక్లాజ్ అవతారమెత్తారు. ఈ యేడాది క్రిస్మస్ సందర్భంగా తన కుటుంబ సభ్యులకు వింతైన అనుభూతిని కల్పించారు. ముఖ్యంగా తన కూతురు జీవా ఆకాంక్ష మేరకు క్రిస్మస్ తాత వేషధారణలో ఉత్సవాలు జరుపుకున్నారు. ధోనీ ఇంట్లో జరుపుకున్న ఈ వేడుకల్లో భార్య సాక్షి ధోనీ, కూతురు జీవాతో పాటు. .బాలీవుడ్ నటి కృతి సనన్, కబీర్ బహిరా తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ అరుదైన వేడుకల దృశ్యాలను ధోనీ భార్య సాక్షి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో, ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి.
తన కాలుకు గాయం కావడంతో ఇటీవలే ధోనీకి శస్త్రచికిత్స జరిగింది. ఆ గాయంనుంచి కోలుకున్న ధోనీ కుటుంబసభ్యులతో కలిసి ఆనందంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. తండ్రి తనకోసం వేసిన వేషం చూసి జీవా ఉబ్బితబ్బిబ్బై పోయింది. ఇప్పుడు ధోనీ శాంతాక్లాజ్ ఫోటోలు సోషల్ మీడియా యూజర్లకు, ముఖ్యంగా ఆయన అభిమానులకు మంచి అనుభూతిని పంచుతున్నాయి.