30.7 C
Hyderabad
Sunday, May 3, 2026

Live Video

spot_img

పాకిస్థాన్ కు చైనా యుద్ధ విమానాలు..?

పాకిస్థాన్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. చైనా నుంచి అత్యంత ఆధునికమైన 40 స్టెల్త్ ఫైటర్ జెట్స్‌ను కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం పాకిస్థాన్ పీకల్లోతూ ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయి ఉంది. అయినా ఈ డీల్‌ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి. చైనా ఈ డీల్‌కు అంగీకరిస్తే మొదటిసారి ఈ విమానాలు విదేశాలకు ఎగుమతి చేసినట్టు అవుతుంది.

స్టెల్త్‌ ఫైటర్‌ జెట్‌ విమానాల తయారీలో చైనా దూసుకుపోతోంది. చైనా జే-20 పేరుతో ఫిఫ్త్ జనరేషన్‌ స్టెల్త్‌ ఫైటర్ జెట్‌లను తయారు చేసింది. ఈ జెట్స్‌ను దక్కించుకోవాలని చూస్తోంది పాకిస్థాన్‌. ఇప్పటికే అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న ఎఫ్‌ 16, ఫ్రెంచ్‌ నుంచి దిగుమతి చేసుకున్న మిరాజ్‌ జెట్స్‌ స్థానంలో జే-35 ఏ జెట్స్‌ను రిప్లేస్ చేయాలనే ఆలోచనలో ఉంది పాకిస్థాన్.

చైనా మీడియా ప్రకారం చూస్తే ఇప్పటికే ఈ ఒప్పందం దాదాపుగా పూర్తైనట్టు తెలుస్తోంది. అధికారికంగా కుదిరిన తర్వాత రెండేళ్లలో పాకిస్థాన్‌కు ఈ జెట్స్‌ను అందించాల్సి ఉంటుంది. ఇదే కుదిరితే ఇండియాకు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే షెన్‌యాంగ్‌ జే-35 ఏ స్టెల్త్‌ ఫైటర్‌ జెట్‌ ట్విన్‌ ఇంజిన్‌, సింగిల్‌ సీటర్‌ సూపర్‌సోనిక్‌ఎయిర్‌ సుపీరియారిటీ మల్టీరోల్‌ ఫైటర్‌ జెట్‌ విమానం. ఇది యూఎస్‌ ఎయిర్‌ఫోర్స్‌లోని లాక్హీడ్ మార్టిన్ ఎఫ్‌-35కి దగ్గరగా ఉంటుంది. దీన్ని కాపీ చేసే చైనా తయారు చేసిందనే ఆరోపణలు ఉన్నాయి.

పాకిస్థాన్ పైసా చెల్లించే పరిస్థితిలో లేకున్నా.. ఈ డీల్‌కు ఓకే చెప్పేందుకు రెడీగా ఉన్నట్టుంది చైనా. దీనికి కారణం భారత్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత్‌పై అక్కసుతో పాక్‌కు ఇప్పటికే కాసులు కుమ్మరిస్తోంది. ఇప్పుడు తలకు మించిన భారం అని తెలిసినా కూడా భారత్‌కు చెక్ పెట్టేందుకు రెడీ అవుతుంది చైనా.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com