28.4 C
Hyderabad
Sunday, July 26, 2026

Live Video

spot_img

సునీతా రాకకు వేళాయే.. నింగిలోకి నాసా రాకెట్

ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో చిక్కుకుపోయిన అస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్‌లను భూమి మీదకు తీసుకొచ్చేందుకు సమయం దగ్గర పడింది. నాసా-స్పేస్ ఎక్స్‌లు సంయుక్తంగా దీనికి సంబంధించి రాకెట్‌ను ప్రయోగించాయి. స్పేస్‌ ఎక్స్‌కు చెందిన క్రూ-10 మిషన్‌ కింద ఫాల్కన్ -9 రాకెట్‌ను నింగిలోకి పంపాయి. నిజానికి ఈ ప్రయోగం మూడు రోజుల కిందటే జరగాల్సి ఉంది. కానీ సాంకేతిక సమస్యల కారణంగా వాయిదా పడింది.

ఈ రాకెట్‌లో అస్ట్రోనాట్స్ మెక్‌క్లెయిన్, నికోల్ అయర్స్, టకుయా ఒనిషి, కిరిల్ పేస్కోవ్ ISSలోకి అడుగుపెట్టనున్నారు. భారత కాలమానం ప్రకారం ఈరోజు తెల్లవారుజామున 4:33 గంటలకు ఈ రాకెట్‌ నింగిలోకి దూసుకుపోయింది. నలుగురు ఆస్ట్రోనాట్స్ ISSకు చేరుకోగానే.. అక్కడున్న నలుగురు ఆస్ట్రోనాట్స్‌ భూమిపైకి తిరిగి రానున్నారు. ఇందులో సునీతా విలియమ్స్, విల్మోర్, నిక్ హేగ్, రష్యా కాస్మోనాట్ గోర్బోనావ్ భూమిపైకి రానున్నారు.

2024 జూన్‌ 5న బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్‌లో సునీతా, బల్మోర్ ఇంటర్నేషనల్ స్పేస్‌ స్టేషన్‌కు వెళ్లారు. ముందుగా అనుకున్న ప్రకారం వారం రోజులకే తిరిగి రావాలి. కానీ స్టార్‌లైనర్‌లో టెక్నికల్ ఇష్యూస్ కారంగా అక్కడే చిక్కుకుపోయారు. స్పేస్‌ఎక్స్‌కు చెందిన స్పేష్‌ షిప్‌ సాయంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో తీసుకొస్తామని నాసా చెప్పింది. కానీ వారి రిటర్న్ జర్మీ ఆలస్యమైంది. 8 రోజులనుకొని వెళ్లిన వీరి యాత్ర ఏకంగా 9 నెలలు పొడిగించినట్టైంది. అస్టోనాట్స్‌ను సురక్షితంగా తీసుకురావడమే తమ లక్ష్యమని.. అందుకే ఈ ప్రయోగం ఆలస్యమవుతుందని తెలిపింది.

సునీతా ఆరోగ్యంపై అనేక అనుమానాలు వచ్చాయి. రీసెంట్‌గా వైరల్ అయిన ఫోటోల్లో ఆమె చాలా బక్కగా కనిపించారు. అంతరిక్షంలో వ్యోమగాములకు ‘స్పేస్ ఎనీమియా’ రోగం వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మైక్రో గ్రావిటీ పరిస్థితుల్లో ఎర్ర రక్తకణాలు వేగంగా క్షీణిస్తాయి. ఆక్సిజన్ అవసరాలను తగ్గించుకునేందుకు శరీరం ఎర్ర రక్తకణాలను నాశనం చేస్తూ సమతుల్యతను కాపాడుతుందని అంటున్నారు. సునీతా విలియమ్స్ తోపాటు ఆస్ట్రోనాట్‌‌ల ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ ఇచ్చింది. సునీతా విలియమ్స్‌ సహా అంతరిక్ష కేంద్రంలో ఉన్న వ్యోమగాములంతా పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని తెలిపింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com