- పీకల్లోతు అప్పుల్లో ఉన్న పాకిస్థాన్..
- అయినా భారత్ తో యుద్ధం చేస్తున్న దాయాది దేశం
- తాజాగా అప్పు కోసం ఐఎంఎఫ్ ను దేబిరింపు
- పాక్ కు 2.4 బిలియన్ డాలర్ల అప్పు ఇచ్చిఇన ఐఎంఎఫ్
- అప్పు పుట్టడం వెనుక అమెరికా హస్తం..
- వద్దని గట్టిగా వాదించిన భారత్
- ఓటింగ్ బహిష్కరించిన భారత్
- ఐఎంఎప్ కు నిధులిచ్చే పెద్ద దేశం అమెరికాయే
- అందుకే అగ్రరాజ్యం పెత్తనం
- కొత్త అప్పుతో మళ్లీ ఆయుధాలు కొనే ఛాన్స్
- ఇది సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు నివ్వడమే
ఇండో -పాక్ ఉద్రిక్తతలను అమెరికా తన స్వార్ధానికి వాడుకుంటోందా?తాజా పరిణామాలను చూస్తే అదే నిజమనిపిస్తోంది. పీకల్లోతు అప్పుల్లో ఉన్న పాకిస్థాన్ కు తాజాగా 2.4 బిలియన్ డాలర్ల ఐఎంఎఫ్ రుణం ఇవ్వడం ఈ అనుమానాలను బలపరుస్తోంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి అనేది ఆపన్నులను ఆదుకునే ఒక రుణ వసతి కేంద్రం. వాషింగ్టన్ లో దీని కార్యాలయం ఉంది. దీనికి మెజారిటీ నిధులు అమెరికానుంచే అందుతాయి. ఉగ్రవాద మూకలతో నిండిపోతున్న పాకిస్థాన్ వారి కొమ్ముకాస్తూ మన దేశంపై యుద్ధం చేస్తోంది. పెహల్గాంలో అమాయక టూరిస్టులను పొట్టన పెట్టుకున్న పాక్ ఉగ్రమూకలకు ఆదేశ ప్రభుత్వం నేరుగా మద్దతు ఇస్తోంది. పైగా సోదర సమానమైన భారత దేశంపై అడ్డగోలు దండయాత్రలు, దొంగదెబ్బలతో రెచ్చిపోతోంది. దేశం నాశనమవుతున్నా.. మింగమెతుకు లేకపోయినా అప్పులు తెచ్చి మరీ యుద్ధానికి తెగబడుతున్న వైనాన్ని యావత్ ప్రపంచం గమనిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో అమెరికా తన ప్రయోజనాలకు వాడుకుంటోందనే అనుమానాలున్నాయి. తమ దగ్గర కుప్పలు తెప్పలుగా ఉన్న ఆయుధాలను అమ్ముకోడానికి ఇదే తగిన సమయమని ఆదేశం ఆలోచిస్తున్నట్లుంది. అందుకే అప్పు కట్టే సమర్ధత లేని దేశానికి దాదాపు వంద కోట్ల డాలర్ల రుణం అంటే చిన్న విషయం కాదు.ఈ కొత్తగా పుట్టిన అప్పుతో పాకిస్థాన్ అమెరికా దగ్గర ఆయుధాలు కొంటుంది.. మళ్లీ మనపై దండ యాత్ర మొదలు పెడుతుంది అని రక్షణ, ఆర్ధిక విశ్లేషకులు అనుమానిస్తున్నారు.
మాట మార్చిన అమెరికా…
అమెరికా ఇలాంటి క్లిష్ట సమయంలో తన దుర్బుద్ధిని బయట పెట్టుకుంది. మొన్నటి వరకూ రెండు దేశాలూ ఈ సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని సుద్దులు చెప్పిన అమెరికా ఇవాళ అప్పు ఇవ్వడమంటే యుద్ధాన్ని పరోక్షంగా ఎగదోయడమే.పైగా ముందు యుద్ధమంటూ వస్తే మేం ఎప్పటికీ భారత్ పక్షమే అని డోనాల్డ్ ట్రంప్ ప్రకటించి పదిరోజులు కాలేదు. ఇంతలోనే ప్లేటు మార్చేసింది. నిన్న రెండు దేశాలు కొంత వెనక్కి తగ్గి చర్చలతో పరిష్కరించుకోవాలని ఉపాధ్యక్షుడు జే.డి. వాన్స్ సూచించారు. భారత్ పై పాక్ దాడి చేసిన తర్వాత ఈ విషయంపై ఎవరికీ తగ్గమని చెప్పలేకపోతున్నామని, ప్రస్తుత పరిణామాల్లో జోక్యం చేసుకోలేమని చేతులు దులుపుకున్నారు. భారత్ పై దాడి జరిగాక ఆ దేశాన్ని తగ్గమని చెప్పలేమని, అలాగే పాకిస్థాన్ ను కూడా తగ్గమని చెప్పలేమని సుతిమెత్తగా తేల్చేశారు.
పరిస్థితిని బట్టి అమెరికా కప్పదాటు?
అమెరికా మాట మార్చడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని అనుమానిస్తున్నారు మన రక్షణ, ఆర్ధిక రంగ నిపుణులు.పాకిస్థాన్ కి పరోక్షంగా సహకరిస్తున్న చైనా ప్రత్యక్షంగా యుద్ధానికి సాయపడితే అమెరికా ఎవరి పక్షం వహిస్తుందన్నది ఆలోచించాల్సిన విషయమని వారంటున్నారు. ప్రస్తుత ట్రేడ్ వార్ లో అమెరికా, చైనా బిజీగా ఉన్నాయి. ఒకరిపై ఒకరు పోటా పోటీగా టారిఫ్ లు విధించుకుంటున్నారు.చైనా పాకిస్థాన్ పక్షం వహిస్తే అమెరికా భారత్ కి మద్దతు ప్రకటించే అవకాశం ఉంది. అదే టైమ్ లో చైనా మనకు మద్దతు ప్రకటిస్తే అమెరికా పాకిస్థాన్ కు మద్దతు పలికే అవకాశం కనిపిస్తోందని ఏదేమైనా ఆసియా ఖండంలో తన ప్రత్యర్ధి వ్యూహాలను బట్టి తాను నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందంటున్నారు.
ఐఎంఎఫ్‌లో నిర్ణయం ఎవరిది?
ఐఎంఎఫ్ లో ప్రపంచ దేశాలు సభ్యులుగా ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ బోర్డులో 25 మంది డైరక్టర్లు ఉంటారు.రోజూ సమావేశమై దేశాలకు అప్పులివ్వడం, రీపేమెంట్ వ్యవహారాలు చూడటం పర్యవేక్షిస్తుంటారు. ఐక్యరాజ్యసమితిలో సభ్యదేశానికి ఒక ఓటు ఉంటుంది. కానీ ఐఎంఎఫ్ లో దేశాల ఆర్ధిక స్థితిని బట్టి ఓటుంటుంది. అమెరికా లాంటి దేశాలకు ఇందులో అందరికన్నా ఎక్కువ నిర్ణయాధికార భాగస్వామ్యం ఉంటుంది. ఐఎంఎఫ్ ఏకాభిప్రాయం ద్వారా నిర్ణయాలు తీసుకుంటుంది.
భారత్ ఎందుకు ఒద్దంది?
గత 28 ఏళ్లుగా ప్రతీ ఏటా క్రమం తప్పకుండా ఐఎంఎఫ్ ను పాకిస్థాన్ ముష్టెత్తుకుంటోంది. అలాగే ఇప్పుడు కూడా ఐఎంఎఫ్ ను రుణ సాయం ఇమ్మని పాకిస్థాన్ కోరింది. అయితే దీనిని భారత్ గట్టిగా తోసిపుచ్చింది. ఉగ్రమూకలను పోషిస్తూ శాంతి భద్రతలకు ముప్పుతెస్తున్న పాకిస్థాన్ కు రుణం ఇవ్వొద్దని భారత్ గట్టిగా ఒత్తిడి తెచ్చింది. అయినా ఐఎంఎఫ్ కోటి బిలియన్ డాలర్ల రుణం మంజూరు చేసింది. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రుణ మంజూరు చేయాలా వద్ద అన్న ఓటింగ్ లో పాల్గొనకుండా బహిష్కరించింది.పాకిస్థాన్ ఎప్పటినుంచో ఐఎంఎఫ్ కు అప్పు బాకీ ఉందని తిరిగి చెల్లించని, ఐఎంఎఫ్ కార్యక్రమాలేవీ నిర్వహించని దేశానికి అప్పెలా ఇస్తారని భారత్ నిలదీసింది. భారత ఓటింగ్ లో పాల్గొనకపోడానికి కారణముంది.ఐఎంఎఫ్ నిబంధనల ప్రకారం నెగటివ్ ఓటు వేసే ఛాన్స్ లేదు. ఓటింగ్ లో పాల్గొనకుండా ఉండటం ద్వారా భారత్ తన వ్యతిరేకతను తెలియ చేసింది.
పాకిస్థాన్ ఆర్ధిక వ్యవహారాల్లో ఇప్పటికీ మిలటరీ అధికారుల హస్తముందని దీనివల్ల నిధుల వినియోగంలో పారదర్శకత ఉండదని, సుస్థిర ప్రగతి, మార్పు సాధ్యంకాదని అమెరికా ఐఎంఎఫ్ దేశాలకు గట్టిగా చెప్పింది. పాకిస్థాన్ లాంటి దేశానికి నిధులు ఇవ్వడమంటే సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రేరేపించడమేనని ఇలాంటి మద్దతుతో ఐఎంఎఫ్ కున్న పేరు, పరపతి కూడా పోతాయని ఇది అంతర్జాతీయ నిబంధనలకు కూడా విరుద్ధమని భారత్ గట్టిగా వాదించింది.
అయితే ఐఎంఎఫ్ పాకిస్థాన్ కు రుణం మంజూరు చేయడం పట్ల సోషల్మీడియాలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది.ఎందుకంటే ఐఎంఎఫ్ ఇచ్చిన 2.3 కోట్ల బిలియన్ డాలర్ల అప్పు ను ఆ దేశం ఆయుధాలు కొనేందుకు వాడుతుంది. కాబట్టి ఆ డబ్బు మళ్లీ అమెరికాకే చేరుతుంది.. దీనిపైనే సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అమెరికా పైకి నీతులు చెబుతూ లోపల ఉగ్రవాదాన్ని సమర్ధిస్తోందని ఆయుధ వ్యాపారం చేస్తోందని, ఉగ్రవాదానికి ఊతమిస్తోందనీ విమర్శలు రేగుతున్నాయి.