అసలు జాతిపితకు, కేసీఆర్‌కు పోలిక ఉందా? అని మాజీ మంత్రి హరీష్‌రావును ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ను జాతిపిత అని హరీష్‌రావు వ్యాఖ్యానించడంపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజమైన జాతిపితకు మందు వాసన తెలుసా? హరీశ్ రావూ.. అంటూ రేవంత్ రెడ్డి చురక అంటించారు. నిజమైన జాతిపిత దళిత వాడల్లో జీవితం గడిపారని, మరి.. హరీశ్ రావు చెప్పే జాతిపిత ఫామ్‌హౌస్‍లో పడుకుంటున్నారని రేవంత్ ఎద్దేవా చేశారు. తెలంగాణ జాతిపిత అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్ అని చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి.
జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం శివునిపల్లెలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రాభివృద్ధి కేసీఆర్‌కు పట్టదని, తీసుకుంటున్న జీతానికైనా ఆయన న్యాయం చేయడం లేదంటూ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్వకుంట్ల కుటుంబం లక్ష కోట్ల రూపాయలు ఎలా సంపాదించిందో చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.