మన కొత్త నేవీ వార్ షిప్ వింతలెన్నో..
ఉక్రెయిన్, రష్యా తీరు. అస్తిత్వం, ఆధిపత్య పోరాటంతో ఏడాది గడచినా రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఆగకపోవడం,ఇంకా కొత్త ఎత్తులు, జిత్తులతో కొనసాగడంచూస్తుంటే ఆ రెండు దేశాలు ఇక భవిష్యత్తులో కలవవు అనుకుంటాం.. ఆ రెండు దేశాల కలయిక సంగతి మాటెలా ఉన్నా కానీ ఆ రెంటితో మైత్రీబంధం కొనసాగిస్తున్న భారత్ మాత్రం బాగా లాభపడుతోంది. ప్రస్తుతం మన దేశానికి వచ్చిన ఐఎన్ఎస్ తుషీల్ అనే నేవీ యుద్ధనౌక ఆ రెండు దేశాల యంత్ర పరికరాలు, టెక్నాలజీ సహకారంతో రూపొందినదే. ఆ రెండు దేశాలూ వేర్వేరుగానే పనిచేసినా.. ఆ యంత్రభాగాలన్నీ కలగలిపితేనే మన నౌక రూపొందింది. ఆ మాట కొస్తే మన దేశం రక్షణ అవసరాలను తీరుస్తున్న యుద్ధనౌకలన్నీ రష్యానుంచి దిగుమతి అయినవే. ఇప్పుడు మనదేశానికొచ్చిన తుషీల్ నౌక కోసం మనం రష్యాకు ఆర్డర్ పెట్టినది 2016 లో. స్టెల్త్ మిసైల్ ను సంధించే సామర్ధ్యం కలిగిన ఈ యుద్ధ నౌక వాస్తవానికి రష్యన్ క్రివాక్ 3 వార్ షిప్. ఇలాంటివే మరో రెండు యుద్ధ నౌకలను యంత్రభాగాల దిగుమతితో గోవాషిప్ యార్డ్ లో మన దేశం స్వయంగా రూపొందిస్తోంది.
ఇండియన్ నేవీకి అభేధ్యకవచమే..
తుషీల్ యుద్ధ నౌకలో విశేషం ఏంటంటే.. అందులో చిన్న చిన్న యంత్రభాగాలు, గ్యాస్ టర్బైన్లు ఉక్రెయిన్ మేడ్ వి కాగా మిగతా షిప్ బాడీ అంతా రష్యన్ మేడ్. తుశీల్ అంటే వాస్త వానికి అభేధ్య కవచం అని అర్ధం. అంటే మన సరిహద్దులు, భూభాగం, తీర ప్రాంతానికి ఇదొక అభేధ్య కవచం అనమాట. సముద్రతీర సరిహద్దులను పకడ్బందీగా కాపలా కాయడం ఈ నౌక లక్ష్యం. భారత నేవీ అవసరాలకోసం ఈ తల్వర్ క్లాస్ యుద్ధనౌకలను రష్యాలో తయారు చేశారు. రష్యా వాడే అడ్మిరల్ గ్రిగరోవిచ్ క్లాస్ యుద్ధనౌకల టెక్నాలజీనే వీటికీ వినియోగించారు.1999,2013 మధ్యకాలంలోఇలాంటి ఆరు యుద్ధనౌకలు తయారు చేసి రష్యా మనకు అందచేసింది.
తయారీలో మన నేవీ టీమ్ సూచనలు..
123 మీటర్ల పొడవు,3,900టన్నుల బరువు కలిగిన తుషీల్ తయారీని రష్యాలోనే ఉన్న మన భారతీయ నావికా దళ టీమ్ ఆమూలాగ్రం, అణువణువు పరిశీలించింది. మన యుద్ధ అవసరాలకు తగిన విధంగా దాని డిజైన్ లో మార్పులు చేయించింది.30 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించే ఈ యుద్ధనౌక అన్నిరకాల పరీక్షలను మూడు దశల్లో ఎదుర్కొని ఫిట్ గా సర్టిఫై అయ్యింది. భారత్ లో ఈ యుద్ధనౌక మన వెస్ట్రన్ నేవల్ కమాండ్ అమ్ముల పొదిలోకి చేరుతుంది.
చైనా దూకుడు నేపధ్యంలో..
భారత సముద్ర జలాల్లో అపరిమితంగా పెరిగిపోతున్న చైనా ఆధిపత్యం , దూకుడు నేపధ్యంలో మనం ఈ వార్ షిప్ ను సిద్ధం చేసుకోవడం ఎంతో అవసరం.ప్రపంచంలోకే అత్యంత వేగంగా తన నావికాదళ సమర్ధతను చైనా పెంచుకుంటూ పోతోంది. ఎక్కువ యుద్ధ నౌకలు కలిగిన అమెరికా రికార్డును కూడా ఆదేశం బీట్ చేసింది. భౌగళిక పరంగా భారత తీర ప్రాంతం వ్యూహాత్మకమైనదైనప్పటికీ చైనాకు వార్ షిప్ లు, ఇతర నౌకల శ్రేణి ఎక్కువ.పవన్ ఉప ముఖ్యమంత్రి