26.5 C
Hyderabad
Friday, November 6, 2026

Live Video

spot_img

భారత స్టాక్ మార్కెట్‌ భారీ పతనం: చరిత్రలో టాప్‌ టెన్‌ క్రాష్‌లు

భారత స్టాక్ మార్కెట్ అట్టుడికిపోయిన రోజు 2025 ఏప్రిల్ 7, సోమవారం. మార్కెట్ ప్రారంభమైన క్షణాల్లోనే అమ్మకాల ఉధృతి మొదలైంది. మార్కెట్‌ సూచీలు దాదాపు అన్ని రంగాల్లో ఎర్రబడ్డాయి. ఇండియా విక్స్ తప్ప ఏ సూచీ కూడా పాజిటివ్‌లో కనిపించలేదు.

సెన్సెక్స్ ఏకంగా 3,939.68 పాయింట్లు అంటే.. 5.27 శాతం పడిపోయి ఇంట్రాడేలో 71,425.01 స్థాయికి చేరింది. అదే సమయంలో నిఫ్టీ 1,160.8 పాయింట్లు అంటే.. 5.06% తగ్గి 21,743.65 కనిష్ట స్థాయికి చేరుకుంది. ఇది భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద పతనాల్లో ఒకటిగా నమోదయ్యింది.

ఇలాంటి భారీ పతనాలు మార్కెట్ చరిత్రలో చాలా సార్లు జరిగాయి. వాటిలో టాప్ 10 క్రాష్‌లు ఇప్పుడు చూద్దాం…

1. 2024 : అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్య, సెన్సెక్స్ దాదాపు 10,000 పాయింట్లు (-11.79%) తగ్గింది. నిఫ్టీ 12.38% పడిపోయింది. జూన్ 3-4 మధ్యలో నిఫ్టీ ఒక్కరోజే 1,380 పాయింట్లు (-5.93%) కోల్పోయింది. ఈ పతనానికి ప్రధాన కారణం 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల ప్రభావమే.
2. 2020 : కోవిడ్-19 విజృంభణ మార్కెట్లను కుదిపేసింది. మార్చి 23న సెన్సెక్స్ 3,934.72 పాయింట్లు (-13.15%) & నిఫ్టీ 1,135 పాయింట్లు (-12.98%) పతనమయ్యాయి. ఇది ఒక్కరోజులోనే జరిగిన అతి పెద్ద పతనం.
3. 2015 : ఆగస్టు 24న చైనా ఆర్థిక మందగమనం ప్రభావంతో సెన్సెక్స్ 1,624 పాయింట్లు, నిఫ్టీ 490 పాయింట్లు పడిపోయాయి.
4. 2008 : లెమాన్ బ్రదర్స్ దివాళాకి కారణమైన ఆర్థిక మాంద్యం వల్ల, జనవరి 21న సెన్సెక్స్ 1,408 పాయింట్లు పడిపోయింది. అదే నెలలో 2,273 పాయింట్ల ఇంట్రాడే పతనంతో 15,332 స్థాయిని తాకింది. ఈ ఘటనల వల్ల ట్రేడింగ్ మధ్యాహ్నం ముందే ఆపేసారు.
5. 2007 : ఆర్థిక మాంద్యం భయాల మధ్య 2007లో ఐదు ప్రధాన పతనాలు నమోదయ్యాయి. ముఖ్యంగా అక్టోబర్ 18న 1,428 పాయింట్ల సెన్సెక్స్ పతనం, డిసెంబర్ 17న మరో భారీ పతనం చోటుచేసుకున్నాయి.
6. 2004 : మే 17న సెన్సెక్స్ 15.52% పతనమైంది. చరిత్రలో అతిపెద్ద రోజువారీ పతనం. ఈ రోజును కూడా “బ్లాక్ మండే”గా పరిగణిస్తారు. ఈ పతనానికి కారణం 2004 ఎన్నికల్లో ఎన్డీఏ ఓటమి.
7. 1992 : హర్షద్ మెహతా స్కాం ప్రభావంతో ఏప్రిల్ 28న మార్కెట్ ఒక్కరోజే 12.77% పడిపోయింది.
8. 1991 : హర్షద్ మెహతా, కేతన్ పరేఖ్ వంటి ప్లేయర్ల మోసాలతో పాటు గ్లోబల్ పరిస్థితుల వల్ల మార్కెట్లలో భారీ అస్థిరత నెలకొంది.
9. 1982 : బెంగాల్‌ బేర్ కార్టెల్ అనే సంస్థ రిలయన్స్ షేర్లను షార్ట్ సేల్ చేయడంతో మూడు రోజులపాటు బీఎస్‌ఈ మూతపడాల్సి వచ్చింది.
10. 1865 : బీఎస్‌ఈ ఏర్పడి సమయంలో కూడా 1865లో మొట్ట మొదటి క్రాష్ జరిగింది. షేర్ల ట్రేడింగ్ అప్పట్లో రాంపార్ట్ రో & మెడోస్ స్ట్రీట్ ప్రాంతాల్లో జరిగేది.

ఈ క్రాష్‌లు మార్కెట్ స్వభావాన్ని ప్రతిబింబిస్తాయి. ఎప్పుడూ పైకి ఎగబాకే సూచీలు, కొన్ని సందర్భాల్లో ఈ విధంగా నేలచూపులు కూడా చూస్తాయి. మదుపర్లకు ఇలాంటివి ఒక వార్నింగ్‌ అని చెప్పొచ్చు. మార్కెట్‌లో రిస్క్, అవగాహన, సంయమనం ఎంత ముఖ్యమో ఇలాంటి పరిణామాలు బోధిస్తాయి.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com