30.7 C
Hyderabad
Friday, November 6, 2026

Live Video

spot_img

మంత్రివర్గ విస్తరణపై పీటముడి

రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణపై చర్చోపచర్చలు జరిగినా కొలిక్కి రాలేదు. మంత్రివర్గ విస్తరణపై అఘమేఘాల మీద సమావేశాలు నిర్వహించిన కాంగ్రెస్‌ పెద్దలు కొద్ది రోజులుగా స్తబ్ధుగా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గవర్నర్‌ను కలిశారు. మూడున ముహూర్తం అని వార్తలు వచ్చినా ఆ తర్వాత పరిస్థితులు మారాయి.

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ భూముల వ్యవహారం తెరమీదకు రావడంతో రాజకీయం వేడెక్కింది. దీంతో క్యాబినేట్‌ విస్తరణ ఆగిపోయినట్టయిందని వార్తలు వచ్చాయి. అయితే అసలు కథ వేరే ఉందని కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మంత్రివర్గంలో బిసీలకు సింహభాగం ఇవ్వాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహూల్‌గాంధీ సూచించటంతో మొత్తం సీన్‌ మారిందని సమాచారం. రాష్ట్ర నేతలు ఈ సూచనతో అవాక్కయ్యారని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి.

ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి, ఆది శ్రీనివాస్‌, బీర్ల ఐలయ్య పేర్లు వినిపించినా అందులో ఒక్కరికే అని మీడియా సర్కిల్స్‌లో ప్రచారం జరిగింది. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి ఖాయమని, బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌, మహిళల నుంచి విజయశాంతి పేర్లు ప్రముఖంగా వినిపించాయి.

భారత్‌ జోడో యాత్ర సమయంలో రాజ్యాంగబద్ద పదవుల్లో బీసీలకు సముచిత స్థానం ఇవ్వటం లేదని, కాంగ్రెస్‌ ఆ లోటు భర్తీ చేస్తుందని రాహూల్‌గాంధీ స్పష్టం చేశారు. పార్లమెంటు సమావేశాల్లో కూడా పలు దఫాలు ప్రస్తావించారు. బీసీలకు జరుగుతున్న నష్టంపై గళమెత్తిన రాహూల్‌… కేంద్రంలోని ముఖ్య విభాగాల్లో గణాంకాలు కూడా వివరించారు.కులగణన చేయవలిసిందే అని ఘంటాపథంగా చెప్పి…తెలంగాణలో నిర్వహించే విధంగా రాహూల్‌ చొరవ తీసుకున్నారు.

తెలంగాణలో జరిగిన కులగణన ప్రహాసనంగా మారిందని, తప్పుల తడకగా ఉందని విమర్శలు వచ్చాయి. దీంతో మరో అవకాశం ఇస్తున్నామని ప్రకటించిన ప్రభుత్వం రెండోసారి నిర్వహించాల్సి వచ్చింది.

మంత్రివర్గంలో బీసీలకు దామాషా ప్రకారం పదవులు దక్కలేదని వివిధ వర్గాల నుంచి విమర్శలు వస్తున్నా ప్రభుత్వంలోని పెద్దలు బుల్డోజ్‌ చేసుకుంటూ వస్తున్నారు. పొన్నం ప్రభాకర్‌ ఒక్కరే బీసీ కోటాలో ఉండగా, కొండా సురేఖ మహిళల కోటాలో వచ్చారు. జనాభా పరంగా చూస్తే మరో నలుగురికి స్థానం దక్కాల్సి ఉంది.

రాష్ట్రంలో సామాజిక సమతౌల్యం కన్నా రాజకీయ పలుకుబడి ప్రభావం చూపుతోంది. అధిష్టానం సూచన ప్రకారం బీసీల సంఖ్య పెరిగితే మిగతా వర్గాల్లో అసంతృప్తి పెల్లుబికే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణపై పీటముడి పడిందని విశ్వసనీయ సమాచారం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com